క్రీడాభూమి

విజేందర్‌పై ప్రశంసల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: డబ్ల్యుబిఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్‌పై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం రాత్రి న్యూఢిల్లీలో సుదీర్ఘంగా 10 రౌండ్ల పాటు జరిగిన బౌట్‌లో విజేందర్ ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ హోప్‌ను మట్టికరిపించి ఈ టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో విజేందర్ యావత్తు దేశానికే గర్వకారణంగా నిలిచాడని రాష్టప్రతి ప్రణబ్ ట్విట్టర్‌లోని తన అధికారిక పేజీలో అభినందించగా, ప్రత్యర్థిని ఓడించి ఆసియా పసిఫిక్ టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు విజేందర్ అద్భుత నైపుణ్యాన్ని, శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించాడని ప్రధాని కొనియాడారు. అలాగే భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టార్ మహిళా బాక్సర్, మణిపూర్ మణిపూస మేరీ కోమ్, టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెవాగ్, వివిఎస్.లక్ష్మణ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రముఖులు కూడా విజేందర్‌కు అభినందనలు తెలిపారు. ‘చాలా సంవత్సరాల తర్వాత ఒక బాక్సింగ్ బౌట్‌ను పూర్తిగా చూశా. ఈ బౌట్‌లో విజేతగా నిలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన విజేందర్‌కు ధన్యవాదాలు. విజేందర్ కఠోర శ్రమకు, అంకితభావానికి, త్యాగనిరతికి ఈ విజయం ఆరంభం మాత్రమే’ అని ధోనీ ట్వీట్ చేశాడు.