క్రీడాభూమి

ఈసారి ఖాన్‌తో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: ప్రపంచ బాక్సింగ్ సంఘం (డబ్ల్యుబిఓ) ఆసియా పసిఫిక్ చాంపియన్ షిప్ సాధించిన సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న విజేందర్ తాను కొద్ది రోజులు ఈ విజయాన్ని ఆస్వాదించిన తర్వాత పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రిటీష్ స్టార్ అమీర్‌ఖాన్‌తో తలపడే అవకాశాలను పరిశీలిస్తానని చెప్తున్నాడు. 30 ఏళ్ల విజేందర్ సింగ్ శనివారం రాత్రి మాజీ డబ్ల్యుబిసి యూరోపియన్ చాంపియన్, ఆస్ట్రేలియాకు చెందిన కెఅరీ హోప్‌ను ఓడించడం ద్వారా వరసగా ఏడో విజయంతో పాటుగా సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను గెలుచుకోవడం తెలిసిందే. ఈ విజయంతో అతను ప్రపంచ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ర్యాకింగ్స్‌లో 15వ స్థానానికి ఎగబాకాడు. అంతేకాదు మరో రెండు నెలల్లోగా అతను తన టైటిల్‌ను నిలబెట్టుకోవలసి ఉంటుంది. తన విజయాన్ని దివంగత బాక్సింగ్ లెజెండ్ హమ్మదాలీకి అంకితం చేసిన విజేందర్‌ను మీడియా ప్రతినిధులు మీ తర్వాతి లక్ష్యం ఏమిటంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బహుశా ఒక నెలరోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నానని, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తానని ఈ ప్రశ్నలకు సమాధానంగా విజేందర్ మొదట చెప్పాడు. అయితే విలేఖరుల సమావేశంలో మీడియా ప్రతినిధులు తన భావి ప్రణాళికపై ప్రశ్నల వర్షం కురిపించడం మానక పోవడంతో చివరికి తన ఆ ప్షన్లను ఏకరువు పెట్టాడు.‘ నా ప్రపంచ ర్యాంకింగ్ ఇప్పుడు టాప్-15లో ఉండొచ్చు. ఇకపై నాకు గట్టి పోటీలు రావచ్చు. అయితే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. నాది, అమీర్ ఖాన్ వెయిట్ కేటగిరీలు భిన్నమైనవి. ఒక వేళ అతను బరువు పెంచుకుంటే లేదా నేను నా బరువు తగ్గించుకుంటే పోటీ గురించి ఆలోచించవచ్చు. దాని గురించి ఆలోచిస్తున్నాం. ఒక వేళ ఆ పోటీ గనుక జరిగితే భారత్‌లోనే జరుగుతుంది’ అని విజేందర్ చెప్పాడు. డబ్ల్యుబిఏ మాజీ చాంపియన్ అయిన అమీర్ ప్రధానంగా లైట్‌వెయిట్ బాక్సర్. ఈ మధ్య అతను మిడిల్‌వెయిట్ కేటగిరీలో ప్రయత్నించి ఘోరంగా విఫలమైనాడు. ప్రపంచ చాంపియన్ సాల్ కనెలో ఆల్వరెజ్‌తో తలపడిన అతను ఆరో రౌండ్‌లోనే ఓడిపోయాడు. అయితే ఆల్వరెజ్‌తో తలపడడానికి ముందు అమీర్ భారత్‌లో విజేందర్‌తో తలపడాలన్న కోరికను వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు తిరిగి తన మామూలు కేటగిరీలోకి మారిన అతను దీనికి సిద్ధపడతాడా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాగా, దీర్ఘకాలంలో అమీర్‌తో పోటీ విషయంపై కూడా తాము దృష్టిపెట్టిఉంటామని విజేందర్ ప్రమోటర్ అయిన ఫ్రాన్సిస్ వారెన్ అంటున్నారు. కాగా, సమీప భవిష్యత్తులో విజేందర్ ప్రస్తుత కామనె్వల్త్ చాంపియన్ లూక్ బ్లాక్‌లెడ్జ్‌తో తలపడే అవకాశం ఉంది. నిజానికి శనివారం రాత్రి జరిగిన పోటీలో హోప్‌కు బదులు ఆయనతోనే తలపడేందుకు చేసిన ప్రతిపాదనకు బ్లాక్‌లెడ్జ్ తిరస్కరించాడు.

చిత్రం... డబ్ల్యుబిఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్
టైటిల్‌తో భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్