క్రీడాభూమి

ఇతనోన్‌కు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, జూలై 18: డోపింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నుంచి థాయిలాండ్ స్టార్ షట్లర్ రచనోక్ ఇతనోన్‌కు సోమవారం మోక్షం లభించింది. దీంతో ఆమె వచ్చే నెల బ్రెజిల్‌లో జరిగే రియో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. మే 15వ తేదీన ఇతనోన్ అందజేసిన మూత్ర నమూనాలో ట్రియామ్‌సినొలోన్ ఎసిటోనైడ్ అనే మాదకద్రవ్య అవశేషాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో ఆమె డోపింగ్‌కు పాల్పడిందన్న అభియోగాలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) కమిటీ విచారణ జరిపి ఇతనోన్ డోపింగ్ నిబంధనలను అతిక్రమించలేదని, కనుక గత బుధవారం ఆమెపై విధించిన ప్రాథమిక సస్పెన్షన్‌ను ఎత్తివేసి తక్షణమే పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో సంతోషాన్ని తట్టుకోలేక ఇతనోన్ భోరున ఏడ్చేసింది. తాను నిర్దోషినన్న విషయం తనకు తెలుసని, డోపింగ్ కమిటీ విచారణలో తనకు న్యాయం జరిగి రియో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషిస్తున్నానని ఆమె పేర్కొంది.