క్రీడాభూమి

సానియా ఉండగా భయమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 18: ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి తన పక్కన ఉంటున్నందున రియో ఒలింపిక్స్‌పై పెద్ద పెద్ద పేరున్న క్రీడాకారిణిలను ఎదుర్కోవడానికి తానేమీ భయపడనని రియో ఒలింపిక్స్‌లో సానియా మీర్జాతో కలిసి డబుల్స్ జంటగా ఆడనున్న ప్రార్థనా తొంబ్రే చెప్పింది. ‘పెద్ద పెద్ద పేరున్న క్రీడాకారిణులను మేము ఢీకొంటాం. అయితే నాకెలాంటి భయమూ లేదు. ఎందుకంటే ప్రపంచ నంబర్ వన్ అయిన సానియా మీర్జా నా పక్కనే ఉంటుంది. నేను నిజంగా అందుకు సిద్ధమయ్యాననే అనుకుంటున్నాను’ అని శుక్రవారం ఇక్కడ తాను పని చేసే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తనను సన్మానించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రార్థన చెప్పింది. గట్టిప్రత్యర్థులెవరని అడగ్గా, వీనస్, సెరీనా సోదరీమణులు, కారోలిన్ గార్సియా, ఇటీవల ప్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచిన క్రిస్టినా మ్లాడనోవిక్‌లాంటి లాంటి ఎందరో క్రీడాకారిణులున్నారని ఆమె చెప్పింది. సానియాతో మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుందని అడగ్గా, సానియా తండ్రి తనకు కోచ్ అని, తాను ఆమె అకాడమీలో శిక్షణ పొందుతున్నానని అందువల్ల ఆమెతో ఆడడం తనకు ఇబ్బందిగా ఉండదని ప్రార్థన చెప్పింది. అంతేకాక సానియాతో కలిసి తాను చాలా టోర్నమెంట్లు ఆడానని కూడా ఆమె తెలిపింది.