క్రీడాభూమి

అక్షర్ వర్సెస్ శిఖర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 27: చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగే ఫైనల్‌లో గుజరాత్, ఢిల్లీ జట్లు తలపడనుండగా, పోటీ ప్రధానంగా అక్షర్ పటేల్, శిఖర్ ధావన్ మధ్య ఉంటుందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. 2012-13 సీజన్‌లో విజేతగా నిలిచిన ఢిల్లీ జట్టు మరోసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. కెప్టెన్ గౌతం గంభీర్ ఫామ్‌లో లేకపోయినా, యువ బ్యాట్స్‌మన్ ఉన్ముక్త్ చాంద్ చక్కటి ఆటతో రాణిస్తున్నప్పటికీ అందరి దృష్టి శిఖర్ ధావన్‌పై ఉంది. ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమవుతున్న అతను ఈ మ్యాచ్‌ని ప్రాక్టీస్ సెషన్‌గా వినియోగించుకునే అవకాశం ఉంది. ధావన్ చెలరేగిపోతే, అతనిని నిలువరించడం అనుకున్నంత సులభం కాదు. చెప్పుకోదగ్గ స్టార్లు ఎవరూ లేని గుజరాత్‌లో అక్షర్ పటేల్ ఒక్కడికే ధావన్ దూకుడును అడ్డుకునే సత్తా ఉంది. ధావన్ బ్యాటింగ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌కు మధ్య గట్టిపోటీ తప్పక పోవచ్చు. ఢిల్లీ జట్టులో భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇశాంత్ శర్మ, ఆశిష్ నెహ్రా వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. కాగితంపై చూస్తే పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీకే విజయావకాశాలు ఎక్కువ. అయితే, యువ ఆటగాళ్లు ఎక్కువ మందివున్న గుజరాత్‌ను తక్కువ అంచనా వేయడానికి విల్లేదు. కెప్టెన్ పార్థీవ్ పటేల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం ఉంది. అక్షర్ పటేల్ టీమిండియా సభ్యుడు. హార్దిక్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, చిరాగ్ గాంధీ, మన్‌ప్రీత్ జునేజా వంటి సమర్థులు ఆ జట్టులో ఉన్నారు. ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్న ఢిల్లీని గుజరాత్ ఏ విధంగా కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.