క్రీడాభూమి

గ్లామోర్గాన్ ఆటగాడి ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్విన్ బే (బ్రిటన్), జూలై 18: ఇంగ్లాండ్‌లోని గ్లామోర్గాన్ కౌంటీ జట్టుకు చెందిన యువ ఆటగాడు అనెయురిన్ డొనాల్డ్ (19) ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సత్తా చాటుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం డెర్బీషైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతను అద్భుత ఇన్నింగ్స్ ఆడి 123 బంతుల్లో 15 ఫోర్ల సహాయంతో వేగవంతంగా డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ రవిశాస్ర్తీ 1985లో స్వదేశంలో అత్యంత వేగవంతంగా డబుల్ సెంచరీ సాధించి నెలకొల్పిన రికార్డు సమమైంది. గ్లామోర్గాన్ జట్టు 96 పరుగులకు 3 వికెట్లను కోల్పోయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన డొనాల్డ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి అద్భుతమైన సిక్సర్‌తో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత జోరు మరింత పెంచిన డొనాల్డ్ 150, 200 పరుగుల మైలురాళ్లను కూడా సిక్సర్ల ద్వారానే అధిగమించడం విశేషం.

చిత్రం.. రవిశాస్ర్తీ రికార్డును సమం చేసిన డొనాల్డ్