క్రీడాభూమి

జెకెసిఎ అధ్యక్షునిగా మంత్రి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 19: జమ్మూ-కాశ్మీరు క్రికెట్ సంఘం (జెకెసిఎ) మంగళవారం తమ అధ్యక్షునిగా ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఇమ్రాన్ అన్సారీని ఎన్నుకుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)తో పాటు దాని అనుబంధ సంఘాల పాలక మండళ్లలో మంత్రులు, ప్రభుత్వాధికారులకు చోటు కల్పించవద్దని స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పును వెలువరించి కనీసం ఒక రోజైనా తిరక్కుండానే అందుకు పూర్తి విరుద్ధంగా ఈ ఎన్నిక జరగడం గమనార్హం. మూడు దశాబ్దాల నుంచి జెకెసిఎ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జమ్మూ-కాశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా శకానికి గత ఏడాది తెర దించిన అన్సారీ మంగళవారం ఆ రాష్ట్ర క్రికెట్ సంఘానికి నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా ఆయన పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, జెకెసిఎ ఎన్నికలు సకాలంలో జరగడం ఇదే మొదటిసారి అని తెలిపాడు. ‘జెకెసిఎకి ఏడాది వ్యవధిలోగా ఎన్నికలు నిర్వహిస్తామని గతేడాది నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడే చెప్పాం. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నాం’ అని అన్సారీ పేర్కొన్నాడు.