క్రీడాభూమి

సత్తా చాటిన టైటాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 19: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు దబాంగ్ ఢిల్లీ జట్టుపై 36-28 పాయింట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. మరోసారి తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌధరి అద్భుత ప్రతిభ కనబరచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రత్యర్థి ఆటగాడిని నిరోధించే ప్రయత్నంలో నుదుటికి గాయమైనప్పటికీ బ్యాండేజితోనే ఆడిన రాహుల్ 16 పాయింట్లు సాధించి జట్టు విజయంలో మరోసారి కీల పాత్ర పోషించాడు. ఫలితంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాట్ సహా మూడు అవార్డులను దక్కించుకున్నాడు. తొలుత వరసగా మూడు ఓటములతో వెనుబడిన తెలుగు టైటాన్స్ ఆ తర్వాత వరసగా ఆరు విజయాలను నమోదు చేసి ఇప్పుడు పాయింట్ల పట్టికలో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌కన్నా పైస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. మరో వైపు తొమ్మిది మ్యాచ్‌లలో ఢిల్లీ జట్టుకు ఇది అయిదో ఓటమి. దీంతో ఎనిమిది జట్ల లీగ్‌లో కేవలం ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచిన ఆ జట్టు సెమీ ఫైనల్ ఆశలు దాదాపు తుడిచిపెట్టుకు పోయినట్లయింది.