క్రీడాభూమి

మైండ్‌సెట్ మారాలి : కుంబ్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంటిగ్వా, జూలై 20: వెస్టిండీస్‌తో గురువారంనుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల ఆలోచనా ధోరణి (మైండ్‌సెట్) మారాల్సిన అవసరం ఉందని జట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయ పడ్డాడు. టెస్టు సిరీస్ ప్రారంభం కావడానికి ముందు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌నుంచి టెస్ట్ఫార్మాట్‌కు ఆటగాళ్ల మైండ్‌సెట్‌ను మార్చడంపై దృష్టిపెట్టినట్లు కుంబ్లే చెప్పాడు. ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయడం అనేది టెస్టుల్లో చాలా ముఖ్యమని కెరీర్‌లో 132 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కుంబ్లే అన్నాడు. దాదాపు రెండు నెలల పాటు ఐపిఎల్ టి-20 టోర్నమెంట్‌లో ఆడిన తర్వాత భారత ఆటగాళ్లు జింబాబ్వే పర్యటనకు బయలుదేరి వెళ్లినప్పటికీ అక్కడ కూడా మన వాళ్లు వన్‌డేలు, టి-20 మ్యాచ్‌లే ఆడారు.ఈ నేపథ్యంలో కుంబ్లే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. టెస్టుల్లో ఆడేటప్పుడు బౌలర్లు నిలకడగా బౌల్ చేయడంతో పాటుగా ఎక్కువ సమయం బౌల్ చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుందని కుంబ్లే చెప్పాడు. అంతేకాదు మ్యాచ్‌లు గెలవడంలో క్యాచ్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయి గనుక వాటిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ధోనీ చెప్పాడు. వెస్టిడీస్ స్లో వికెట్లపై స్పిన్నర్లు, పేస్ బౌలర్లు ఇద్దరూ కలిసి బౌల్ చేయాల్సి ఉంటుందని కూడా కుంబ్లే అభిప్రాయ పడ్డాడు. అయితే నాలుగు టెస్టులకు ఎలాంటి వికెట్లు ఉంటాయో తనకు తెలియదని అంటూ, ఏది ఏమయినా సిరీస్ గెలవాలంటే స్పిన్నర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నాడు. టెస్టు క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఈ మూడు విభాగాలు ముఖ్యమేనని, అందుకే దాన్ని ఈ మూడు విభాగాలకు పరీక్ష (టెస్ట్)అని అంటారని కుంబ్లే అంటూ, అందుకే ఈ మూడు విభాగాలపైన దృష్టిపెడుతున్నామన్నారు.ఈ మూడే కాకుండా పిట్నెస్‌పై కూడా దృష్టిపెడుతున్నామన్నారు. విదేశీ గడ్డలపై టీమిండియా బ్యాటింగ్ సమతౌల్యంగా ఉండడానికి అశ్విన్‌ను ఆల్‌రౌండర్‌గా తయారు చేయడం పరిష్కారమవుతుందా అన్న ప్రశ్నకు కుంబ్లే సమాధానమిస్తూ, అశ్విన్ నిజంగానే ఓ సమర్థుడైన బ్యాట్స్‌మన్ అని, బౌలర్లు కేవలం బౌలింగ్ చేయడంపైనే కాకుండా బ్యాటింగ్ చేయడంపై కూడా దృష్టిపెడుతున్నామని అన్నాడు. మూడు వారాలుగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండడాన్ని తాను నిజంగా ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని కుంబ్లే తెలిపాడు.