క్రీడాభూమి

స్పిన్నర్ల పాత్రే కీలకం : ధోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: వెస్టిండీస్‌లో స్పిన్నర్లు ప్రముఖ పాత్ర పోషించే అవకాశముందని టెస్టు క్రికెట్‌కు దూరమైన టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటున్నాడు. వెస్టిండీస్‌లో వికెట్లు స్లోగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అలా అయిన పక్షంలో స్పిన్నర్లు గొప్ప పాత్ర పోషించాల్సి ఉంటుంది’ అని బుధవారం ఇక్కడొక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ధోనీ మీడియాతో అన్నాడు. గురువారంనుంచి భారత్-వెస్టిండీస్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు దేశంలో అసలైన ఫాస్ట్‌బౌలర్లు ఎనిమిదినుంచి పదిమంది దాకా ఉండడం సంతోషకరమని ధోనీ అన్నాడు. ‘పోటీ ఎంత ఉంటే అంత మంచిది. ఎంపిక కోసం పోటీ పడుతున్న 8-10 మంది బౌలర్లు ఉండడం సంతోషకరమైన విషయం. ఏడాది క్రితం అంటే దక్షిణాఫ్రికాపై వన్‌డే సిరీస్ సమయంలో చూసినట్లయితే కొద్ది మంది అదీ గాయపడిన వాళ్లే ఉండే వారు’ అని ధోనీ అన్నాడు. అంతేకాదు.. పేస్.. స్వింగ్ ఇలా అన్ని రంగాలకు చెందిన బౌలర్లు ఇప్పుడున్నారన్నాడు. అయితే గాయాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయ పడ్డాడు. ధోనీ కంపెనీ రితి స్పోర్ట్స్ ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్ క్రైగ్ మెక్‌డెర్మాట్ కంపెనీ సెక్యూర్డ్ వెంచర్ క్యాపిటల్‌తో ఒప్పదం కుదుర్చుకున్న సందర్భంగా ధోనీ మీడియాతో మాట్లాడాడు.
అంతేకాదు టీమిండియా బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్ఠంగా ఉందని ధోనీ అన్నాడు. దాదాపుగా కుదురుకున్న టాప్ సిక్స్ బ్యాటింగ్ మనకు ఉంది. ఒకరిద్దరు కొత్త ముఖాలు ఉంటే ఉండవచ్చు కానీ దాదాపుగా కూర్పు అలాగే ఉంటోంది. వాళ్లు సైతం ఉపఖండానికి వెలుపల ఆడిన వాళ్లే కావడం వల్ల అవసరమైన అనుభవం కూడా ఉంటోంది’ అని ధోనీ అన్నాడు. ధోనీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి దాదాపు రెండేళ్లయింది. అయితే ఆ నిర్ణయానికి తానేమీ చింతించడం లేదని ధోనీ అంటున్నాడు. టెస్టు క్రికెట్ ఆడడం మిస్ అయి ఉండవచ్చు.అయితే అందుకు నేనమీ చింతించడం లేదు. జీవించినంతకాలం క్రికెట్‌ను అంటిపెట్టుకుని ఉండడం క్రికెటర్లకు అలావటై పోయింది. అందుకే 40, 50 ఏళ్ల పైబడిన వారు కూడా కామెంటరీకోసం, జూనియర్లకు శిక్షఇ ఇవ్వడం కోసం మళ్లీ వస్తున్నారు. నాకు సంబందించినంతవరకు ఈ నిర్ణయం కుటుంబంతో కొంత సమయం గడపడానికి అవకాశమిస్తోంది’ అని ఆయన అన్నాడు. అంతేకాదు క్రికెట్‌కు దూరంగా ఉండే ఉసమయంలో వారమ సమయాన్ని ప్లాన్ చేసుకోవడానికి అవకాశమిచ్చింది. ఎక్కువ సమయం జిమ్‌లో గడుపుతున్నాను. ఎక్కువ పరుగెత్తుతున్నాను. నా మాడీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నాను. 30 ఏళ్ల తర్వాత శరీరం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నాడు. గత పదేళ్లలో విశ్రాంతి లేకుండా ప్రయాణాలు చేయడం వల్ల శరీరాన్ని చాలా కష్టపెట్టానని అంటూ, ఇప్పుడు బాడీ పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నానని ధోనీ అన్నాడు.

లైన్ అండ్ లెంగ్త్‌తో
బౌల్ చేయడమే పని
అవకాశమిస్తే ప్రయత్నిస్తా : స్టువర్ట్ బిన్నీ
ఆంటిగ్వా, జూలై 20: వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో గనుక అవకాశం లభిస్తే గట్టి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌల్ చేయడం, తోటి బౌలర్లు అలసి పోకుండా ఉండే విధంగా బౌల్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ మిన్నీ చెప్పాడు. తక్కువ పరుగులు ఇవ్వడం ద్వారా తోటి పేస్ బౌలర్లకు తోడ్పడ్డంపైన, అలాగే స్వింగ్‌పైన ఎక్కువ దృష్టి పెడతానని బిన్నీ అన్నాడు. అయితే అలా చేయాలంటే లైన్‌అండ్ లెంగ్త్‌పైన ఎక్కువ దృష్టిపెట్టాల్సి ఉంటుందన్నాడు. అంతేకాదు తన బలమైన ఆయుధం స్వింగ్‌పై కూడా దృష్టి కొనసాగిస్తానన్నాడు. కాగా, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడానికే తాను ఎక్కువ ఇష్టపడతానని, ఎందుకంటే కొత్త బంతి వచ్చే సమయం అదని చెప్తూ, ఇప్పుడు తాను ఎక్కువ ఇష్టపడుతున్న స్థానం అదేనని బిసిసిఐ టీవీ విడుదల చేసిన ఓ వీడియోలో బిన్నీ చెప్పాడు. 2014లో టెస్టుల్లోకి అడుగుపెట్టిన తర్వాత స్టువర్ట్ బిన్నీ ఇప్పటివరకు ఆరు అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
అనూప్ అద్భుత ప్రదర్శన
యు ముంబా ఆశలు సజీవం
ముంబయి, జూలై 20: ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్) నాలుగో సీజన్‌లో యు ముంబా మరో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం ఇక్కడ తమ సొంత గడ్డపై ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో ఆ జట్టు 34-31 తేడాతో పునేరీ పల్టన్‌ను మట్టికరిపించి నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడిన యు ముంబాకు ఇది ఆరో విజయం. కెప్టెన్ అనూప్ కుమార్ అద్భుత ప్రదర్శనతో యు ముంబాకు ఈ విజయాన్ని అందించాడు. ఒకానొక దశలో యు ముంబా 16-19 తేడాతో ప్రత్యర్థుల కంటే వెనుకబడిన తరుణంలో అనూప్ అటు రైడ్స్‌లోనూ, ఇటు ట్యాకిల్స్‌లోనూ అద్భుత ప్రదర్శనతో 11 పాయింట్లు రాబట్టి తమ జట్టుకు ఈ విజయాన్ని అందించాడు. దీంతో ఆ జట్టు ప్రస్తుత సీజన్ ఆరంభంలో తమ సొంత గడ్డపై పునేరీ పల్టన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు మొత్తం 32 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది.