క్రీడాభూమి

హాకీ ధ్రువతార అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: వారణాసి ముద్దుబిడ్డగా ఖ్యాతి పొందిన భారత హాకీ లెజెండ్ మహమ్మద్ షాహిద్ ఇక లేరు. ఆటలో కొనసాగినంత కాలం అద్భుతమైన స్టిక్ వర్క్‌తో ప్రత్యర్థులకు సింహస్వప్నంగా నిలిచిన షాహిద్ గుర్గావ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం కన్నుమూశారు. కామెర్లతో పాటు డెంగ్యూ వాధికి గురై ఆరోగ్యం క్షీణించడంతో షాహిద్‌ను ఈ నెల ఆరంభంలో వారణాసి నుంచి విమానంలో గుర్గావ్‌కు తరలించి మెడిసిటీ ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన దేహంలో వివిధ భాగాలు సరిగా పనిచేయకపోవడం (మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్)తో బుధవారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. షాహిద్ భౌతిక కాయాన్ని వారణాసికి తరలించి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు మహమ్మద్ సైఫ్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఆటలో అద్భుత నైపుణ్యానికి పెట్టింది పేరైన షాహిద్ దేశంలోని హాకీ యోధుల్లో ఒకరిగా ఖ్యాతి పొందారు. 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్న వి.్భస్కరన్ నేతృత్వంలోని భారత హాకీ జట్టులో సభ్యునిగా ఉన్న షాహిద్ 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని, 1986లో సియోల్‌లో జరిగిన ఏషియాడ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జాతీయ జట్టులో కూడా సభ్యునిగా ఉన్నారు.
ప్రధాని విచారం
పలు అంతర్జాతీయ హాకీ టోర్నీలో దేశ కీర్తి, ప్రతిష్టలను ఇనుమడింపజేసిన షాహిద్ మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు దేశంలోని క్రీడాభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అకుంఠిత దీక్ష, పట్టుదలతో విశిష్టమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న షాహిద్ మరణం దురదృష్టకరమని, ఆయన మరణంతో దేశం ఎంతో ప్రతిభావంతుడైన గొప్ప క్రీడాకారుణ్ణి కోల్పోయిందని మోదీ ట్వీట్ చేశారు. షాహిద్ ప్రాణాలను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు, ప్రార్థనలు చేసినా ఫలితం లేకపోవడం విచారకరమని మోదీ పేర్కొన్నారు.
కాగా, షాహిద్ మరణం పట్ల ఆయన సన్నిహిత మిత్రులతో పాటు కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. షాహిద్ కుటుంబ సభ్యులకు ప్రధాని తరపున గోయల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదిలావుంటే, షాహిద్ మృతిచెందాడన్న వార్త తనను విషాదంలో ముంచేసిందని మాజీ హాకీ క్రీడాకారుడు బల్బీర్ సింగ్ (సీనియర్) ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప ఆటగాడిగానే కాకుండా అంతకంటే గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్న షాహిద్ అభిమానుల హృదయాల్లో కలకాలం జీవిస్తాడని ఆయన నివాళులర్పించారు. షాహిద్ మరణం దేశానికి, ముఖ్యంగా క్రీడారంగానికి తీరని లోటని హాకీ ఇండియా (హెచ్‌ఐ) విచారాన్ని వ్యక్తం చేసింది.
పాక్ హాకీ దిగ్గజాల సంతాపం
ఇదిలావుంటే, షాహిద్ మరణం తీవ్ర విచారకరమని పాకిస్తాన్‌కు చెందిన పలువురు హాకీ యోధులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మైదానంలో తాము బద్ధశత్రువుల్లా తలపడినప్పటికీ మైదానం వెలుపల ఎంతో ఆత్మీయంగా ఉండేవారమని పాక్ లెజెండరీ ఆటగాళ్లు హసన్ సర్దార్, సమియుల్లా తదితరులు గుర్తు చేసుకున్నారు. మైదానంలో షాహిద్ తమకు ఎంతో బలమైన ప్రత్యర్థి అని, పాకిస్తాన్ జట్టులో చేరితే ప్రపంచానే్న జయించవచ్చని తాను తరచుగా షాహిద్‌కు చెబుతూ ఉండేవాడినని, అయితే అందుకు ఆయన కూడా అదేవిధంగా సమాధానమిస్తూ, తమను భారత జట్టులో చేరాల్సిందిగా కోరేవాడని హసన్ సర్దార్ తెలిపాడు.