క్రీడాభూమి

ఒలింపిక్స్‌కు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 21: తొడ కండరాల గాయం కారణంగా చాలారోజులుగా పోటీలకు దూరంగా ఉన్న జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌ఒలింపిక్స్‌కు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడమే కాకుండా రియో ఒలిపింక్స్‌కు ముందు శుక్రవారం ఇక్కడ జరిగే వార్షిక గేమ్స్‌లో ఈ సీజన్‌లో తొలిసారిగా 200 మీటర్ల పరుగుపందెంలో తన ఫిట్నెస్‌ను పరీక్షించుబోతున్నాడు. ఆరుసార్లు ఒలింపిక్ విజేత అయిన బోల్ట్ తొడ కండరాల గాయం కారణంగా జమైకాలో జరిగిన ఒలింపిక్స్ ట్రయల్స్‌నుంచి వైదొలగడం తెలిసిందే. దీంతో అతను ఈ సారి ఒలింపిక్స్‌లో పాల్గొంటాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే తాను పూర్తిగా కోలుకున్నానని, ఇప్పుడు బాగా శిక్షణ పొందుతున్నానని, ఇప్పుడున్న స్థితిపై తాను సంతోషంగా ఉన్నానని కూడా బోల్ట్ గురువారం లండన్‌లో విలేఖరులతో చెప్పాడు. అంతేకాదు తనకు ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని కూడా చెప్పాడు. లండన్ ఒలింపిక్స్ స్టేడియంలో బోల్ట్ పాల్గొనే ఈ పరుగే రియో ఒలింపిక్స్ గేమ్స్‌కు ముందు పాల్గొనే చివరి పోటీ అవుతుంది. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, స్ప్రింట్స్ రిలేలో స్వర్ణ పతకాలు సాధించిన విషయం తెలిసిందే. కాగా, 29 ఏళ్ల బోల్ట్‌కు రియో ఒలింపిక్సే చివరి ఒలింపిక్స్ కావచ్చని భావిస్తున్నారు. ఈ ఒలింపిక్స్‌లో ‘ట్రిపుల్ ట్రిపుల్’(అంటే మూడు ఒలింపిక్స్‌లో మూడేసి పతకాలు సాధించడం) అనే అరుదైన ఫీట్‌ను సాధించాలని బోల్ట్ దృఢ సంకల్పంతో ఉన్నాడు. రియో ఒలింపిక్స్‌లో తాను తప్పక పాల్గొంటానని, అందుకోసం తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నానని కూడా బోల్ట్ చెప్పాడు. బోల్ట్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జస్టిన్ గట్లిన్‌కన్నా వెనుకబడి ఉన్నప్పటికీ గత ఏడాది బీజింగ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తాను విజయం సాధించడాన్ని అతను గుర్తు చేస్తున్నాడు.
నిబంధనలు నిబంధనలే..
ఇదిలా ఉండగా, రష్యా డ్రగ్స్ మోసగాళ్లను ఒలింపిక్స్‌కు అనుమతించకూడదంటూ క్రీడలకు సంబందించిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పు అథ్లెట్ల మనస్సుల్లో భయాన్ని పుట్టించడమే కాకుండా డోపింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోను సహించబోమనే సందేశాన్ని ఇచ్చిందని బోల్ట్ అభిప్రాయ పడ్డాడు. ఈ తీర్పు విచారకరమే అయినప్పటికీ రూల్స్ రూల్సేనని అతను అన్నాడు.