క్రీడాభూమి

ఇంగ్లాండ్ జట్టు నుంచి ఫిన్, బాల్‌కు ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్ (బ్రిటన్), జూలై 21: పాకిస్తాన్‌తో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభం కానున్న రెండో మ్యాచ్ కోసం ఇంతకుముందు 14 మందితో ఎంపిక చేసిన జట్టు నుంచి ఫాస్ట్ బౌలర్లు స్టీవ్ ఫిన్, జాక్ బాల్‌ను తొలగించి సభ్యుల సంఖ్యను 12కు కుదించినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఆలిస్టర్ కుక్ గురువారం వెల్లడించాడు. ఈ సిరీస్‌లో ఇంతకుముందు లార్డ్స్‌లో ముగిసిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 75 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ టెస్టులో ఆడిన స్టీవ్ ఫిన్, జాక్ బాల్‌కు ప్రస్తుతం ఉద్వాసన పలకడంతో గాయాల కారణంగా లార్డ్స్‌లో ఆడలేకపోయిన ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ శుక్రవారం బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా ఫిన్, బాల్‌లను తొలగిస్తూ ఇంగ్లాండ్ జట్టు తీసుకున్న నిర్ణయం వలన లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ స్వదేశంలో తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడేందుకు వీలు కలగనుంది.