క్రీడాభూమి

మెక్‌డెర్మాట్ అకాడమీకి శిక్షకుడిగా ధోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ఆస్ట్రేలియాలోని ప్రముఖ ప్రైవేట్ క్రికెట్ అకాడమీల్లో ఒకటైన క్రైగ్ మెక్‌డెర్మాట్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ(సిఎంఐసిఏ)కి టీమిండియా వన్‌డే, టి-20 కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాడు. ముఖ్యంగా క్రికెట్‌కు ప్రాధాన్యతతో స్పోర్ట్స్ సైన్స్, మేనేజిమెంట్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీని ఈ అకాడమీ అందిస్తుంది. ఈ అకాడమీలో భాగస్వామి అవుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఎందుకంటే ఇటు భారత్‌తో పాటుగా అటు ఆస్ట్రేలియాలో పలువురు ఔత్సాహిక యువ క్రికెటర్లను కలుసుకోవడానికి, వారికి మార్గదర్శకుడిగా ఉండడానికి ఇది తనకు అవకాశమిస్తుందని ధోనీ చెప్పాడు. తనను ఇంతవాడిని చేసిన క్రికెట్ రుణం తీర్చుకునేందుకు తనకు ఇది సరయిన వేదిక అని అతను అన్నాడు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన చిన్నారులు, చదువు, క్రీడల మధ్య సమతుల్యత సాధించడానికి కూడా ఈ అకాడమీ తోడ్పడుతుందని కూడా ధోనీ చెప్పాడు. మెక్‌డెర్మాట్‌కు చెందిన ఆస్ట్రేలియా కంపెనీ సెక్యూర్డ్ వెంచర్ క్యాపిటల్స్‌కు ధోనీ అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ అంబాసిడర్ కావడంతో ధోనీకి చెందిన రితి స్పోర్ట్స్, సిఎంఐసిఏకు మధ్య ఓ టైఅప్ సాధ్యమైంది.