క్రీడాభూమి

అమెరికాపై భారత్ ప్రతీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: అమెరికా పర్యటనలో భారత మహిళా హాకీ జట్టు రెండవ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సాధించింది. పెన్సిల్వేనియాలోని మనె్హయిమ్‌లో భారత జట్టు అద్భుత పోరాట పటిమతో విజృంభించి 2-1 గోల్స్ తేడాతో ఆతిథ్య అమెరికాను మట్టికరిపించింది. ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ పోరులో ఇరు జట్లు తొలి 15 నిమిషాల్లో ఒక్క గోల్ కూడా సాధించలేదు. అయితే నాలుగు నిమిషాల తర్వాత అమెరికా క్రీడాకారిణి జిల్ విట్మర్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో ప్రథమార్థం ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యతలో నిలిచింది. దీంతో ద్వితీయార్థంలో భారత క్రీడాకారిణులు అనూహ్య రీతిలో విజృంభించి అమెరికా డిఫెన్స్ విభాగంపై పదేపదే దాడులకు దిగారు. పెనాల్టీ కార్నర్‌ను చక్కగా సద్వినియోగం చేసుకుని ఈక్వలైజర్‌ను అందించడంతో 45వ నిమిషంలో భారత్ ప్రయత్నాలు ఫలించాయి. ఆ తర్వాత ప్రత్యర్థులపై మరింత వత్తిడి పెంచిన భారత జట్టుకు లిలిమా మిన్జ్ 55వ నిమిషంలో అద్భుతమైన గోల్‌ను అందించింది. దీంతో 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇంతకుముందు తొలి మ్యాచ్‌లో 2-3 తేడాతో ఎదురైన ఓటమికి అమెరికన్లపై ప్రతీకారం తీర్చుకుంది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లడానికి ముందు తుది సన్నాహాల్లో నిమగ్నమైన భారత జట్టు శుక్రవారం కెనడాతో తలపడనుంది.

చిత్రం..ప్రత్యర్థుల గోల్‌పోస్టు వైపు దూసుకెళ్తున్న లిలిమా మిన్జ్ (మధ్యలో)