క్రీడాభూమి

గిన్నిస్ రికార్డుల్లో పుణె మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 21: పుణెకు చెందిన మిషెల్లీ కాకడే కాలి నడకన పరుగెత్తి భారత స్వర్ణ చతుర్భుజిని అధిగమించిన తొలి వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలోకి ఎక్కింది. ఈ మేరకు గిన్నిస్‌నుంచి గుర్తింపు, సర్ట్ఫికెట్‌ను వ్యాపార వేత్త అనిల్ కాకడే భార్య, ఇద్దరు పిల్లల తల్లి అయిన 47 ఏళ్ల మిషెల్లీ అందుకున్నట్లు గురువారం ఒక పత్రికా ప్రకటన తెలిపింది. ‘కాలి నడకన ఒక మహిళ భారత స్వర్ణ చతుర్భుజిని అత్యంత వేగవంతమైన సమయం 193 రోజుల ఒక గంట 9 నిమిషాల సమయాన్ని 2015 అక్టోబర్ 21, 2016 మే 1 మధ్య కాలంలో మిచెల్లే కాకడే సాధించారు’ అని ఆ సర్ట్ఫికెట్‌లో పేర్కొన్నారు. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాలను కలిపే 5968.4 కిలోమీటర్ల స్వర్ణ చతుర్భుజిని కవర్ చేసిన వ్యక్తిగా మిషెల్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారని ఆ ప్రకటన తెలిపింది. స్వర్ణ చతుర్భుజిలో భాగమైన ముంబయి-్ఢల్లీ మధ్య దూరం 1514.2 కిలోమీటర్లు కాగా, ఢిల్లీ-కోల్‌కతా మధ్య దూరం 1542.18 కి.మీ, కోల్‌కతా-చెన్నై 1554.49 కి.మీ. చెన్నై-ముంబయి మధ్య దూరం 1357.53 కి.మీ. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన ప్రయత్నాన్ని గుర్తించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని మూడు సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన మిషెల్లీ చెప్పింది. దేశంలోని కోట్లాది మందికి దీన్ని అంకితం చేస్తున్నానని కూడా ఆమె చెప్పింది.

చిత్రం..కాలి నడక పరుగుతో స్వర్ణ చతుర్భుజిని అధిగమించి చరిత్ర సృష్టించిన మిషెల్లీ