క్రీడాభూమి

రష్యాకు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసానే, జూలై 21: అందరూ అనుకున్నట్లుగానే డోపింగ్ కుంభకోణంలో రష్యాకు అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎస్‌ఎ)లో చుక్కెదురైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కుంభకోణం జరిగిందన్న అభియోగాల నేపథ్యంలో తమ క్రీడాకారులు రియో లింపిక్స్‌లో పాల్గొనకుండా అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ సమాఖ్య (ఐఎఎఎఫ్) నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ రష్యా చేసుకున్న అప్పీలును సిఎస్‌ఎ గురువారం డిస్మిస్ చేసింది. డోపింగ్ కుంభకోణంలో రష్యా జాతీయ క్రీడా సమాఖ్యపై నిషేధం విధించడంతో పాటు ఐఎఎఎఫ్ నిబంధనల ప్రకారం జరిగే ఏ పోటీల్లోనూ ఆ దేశ క్రీడాకారులను అనుమతించరాదని అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య తీసుకున్న నిర్ణయం నిబంధనలకు అనుగుణంగానే ఉందని, కనుక ఈ నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సిఎస్‌ఎ కమిటీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, రియో ఒలింపిక్స్ నుంచి రష్యాను పూర్తిగా నిషేధించాలా? లేదా? అనే దానిపై తాము తీసుకోబోయే నిర్ణయం ఒక రూపాన్ని సంతరించుకునేందుకు సిఎస్‌ఎ తీర్పు దోహదపడుతుందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) పేర్కొంది.