క్రీడాభూమి

స్మిత్, వోగ్స్ అజేయ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శతకంతో రాణించిన ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్. అతను ఈఏడాది ఆరవ, మొత్తం మీద 13వ టెస్టు సెంచరీని సాధించాడు. ఈ ఏడు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే సమయానికి అతను 1,404 పరుగులతో నంబర్ వన్ స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ 1,357 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

కెరీర్‌లో నాలుగో టెస్టు సెంచరీ చేసిన ఆడమ్ వోగ్స్. ఈ ఏడాదే టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతను 18 మ్యాచ్‌ల్లోనే 1,000 పరుగుల మైలురాయిని అధిగమించడం విశేషం. అతను ఇప్పటి వరకూ 1,028 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో మార్క్ టేలర్ (ఆస్ట్రేలియా/ 1,219), అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్/ 1,013) మాత్రమే తాము టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఏడాది వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఆ జాబితాలో మూడో క్రికెటర్‌గా వోగ్స్ చేరాడు. మైఖేల్ క్లార్క్, బ్రాడ్ హాడిన్, షేన్ వాట్సన్ వంటి ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఆసీస్ జట్టు బ్యాటింగ్ లైనప్ ఇప్పటికీ బలంగా ఉండడం విశేషం.

మెల్బోర్న్, డిసెంబర్ 27: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చెలరేగిపోతున్నది. మొదటి రోజు ఆటలో జొస్ బర్న్స్ (128), ఉస్మాన్ ఖాజా (144) సెంచరీలను నమోదు చేయగా, రెండో రోజు కెప్టెన్ స్టీవెన్ స్మిత్, ఆడమ్ వోగ్స్ అజేయ శతకాలతో కదం తొక్కారు. మూడు వికెట్లకు 551 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు స్మిత్ ప్రకటించాడు. అప్పటికి అతను 134 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. వోగ్స్ 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడు వికెట్లకు 345 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఉదయం ఆటను కొనసాగించిన ఆసీస్‌ను కట్టడి చేయడంలో విండీస్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఒక్క వికెట్‌ను కూడా సాధించలేక చేతులెత్తేశారు. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు స్మిత్ ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పటికే మొదటి టెస్టును కోల్పోయి వెనుకంజలో ఉన్న విండీస్ ఈ టెస్టులో ఎదురుదాడికి దిగే ప్రయత్నం కూడా చేయకపోవడం విచిత్రం. విండీస్ మొదటి ఇన్నింగ్స్ ఆరంభమైన వెంటనే వికెట్ల పతనం కూడా మొదలైంది. 35 పరుగుల వద్ద క్రెగ్ బ్రాత్‌వెయిట్ (17)ను బర్న్స్ క్యాచ్ అందుకోగా నాథన్ లియాన్ అవుట్ చేశాడు. ఆతర్వాత విండీస్ కోలుకోలేకపోయింది. రాజేంద్ర చంద్రిక 25 పరుగులకు అవుట్‌కాగా, మార్లొన్ శామ్యూల్స్ పరుగుల ఖాతాను తెరవకుండానే వెనుదిరిగాడు. డారెన్ బ్రేవో క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతుంటే, అతనికి కొద్దిసేపు సహకరించిన జెర్మైన్ బ్లాక్‌వుడ్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద లియాన్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దనీష్ రాందీన్ (0), జాసన్ హోల్డర్ (0)లను పీటర్ సిడిల్ రెండు వరుస బంతుల్లో పెవిలియన్ పంపాడు. 83 పరుగుల వద్ద విండీస్ ఆరో వికెట్ కోల్పోయింది. రెండోరోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి విండీస్ స్కోరు 91 పరుగులకు చేరింది. అప్పటికి డారెన్ బ్రేవో 13, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 3 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరూ మ్యాచ్ మూడో రోజు ఎంత సేపు పోరాటాన్ని కొనసాగిస్తారన్నది అనుమానంగానే ఉంది. అనూహ్యమైన రీతిలో భారీ భాగస్వామ్యాలు నమోదైతేగానీ విండీస్‌కు ఫాలోఆన్ గండం నుంచి బయటపడే అవకాశం లేదు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 345): 135 ఓవర్లలో 3 వికెట్లకు 551 డిక్లేర్ (బర్న్స్ 128, ఖాజా 144, స్టీవెన్ స్మిత్ 134, వోగ్స్ 106).
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 43 ఓవర్లలో 6 వికెట్లకు 91 (చంద్రిక 25, బ్లాక్‌వుడ్ 28, డారెన్ బ్రేవో 13 నాటౌట్, పాటిన్సన్ 2/36, లియాన్ 2/18, సిడిల్ 2/19).