క్రీడాభూమి

రియో ఒలింపిక్స్‌లో ఐదో సీడ్‌గా సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 21: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో వచ్చే నెల జరుగనున్న ఒలింపిక్ క్రీడల్లో భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్‌గా బరిలోకి దిగనుండగా, తెలుగు తేజం పివి.సింధుకు 9వ సీడింగ్‌ను, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌కు టాప్ సీడింగ్‌ను ఇచ్చారు. పురుషుల సింగిల్స్ కేటగిరీలో తలపడే క్రీడాకారుల్లో 13 మందికి, మహిళల సింగిల్స్ కేటగిరీలో తలపడే క్రీడాకారిణుల్లో 13 మందికి సీడింగ్‌లను ఇచ్చారు. పురుషుల సింగిల్స్ కేటగిరీలో మలేసియా ఆటగాడు లీ చోంగ్ వెయ్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుండగా, భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌కు 9వ సీడ్‌ను కేటాయించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో గురువారం నాటికి క్రీడాకారుల స్థానాలను ఆధారంగా చేసుకుని ఈ సీడింగ్‌లను ప్రకటించడం జరిగిందని, ఈ సీడింగ్స్‌ను ప్రాతిపదికగా చేసుకుని రియో ఒలింపిక్స్‌కు ఈ నెల 26వ తేదీన నిర్వహించడం జరుగుతుందని ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రియో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ విభాగంలో తలపడనున్న మొత్తం 41 మంది ఆటగాళ్లను 13 గ్రూపులు గానూ, మహిళల సింగిల్స్ విభాగంలో తలపడే 40 మందిని 13 గ్రూపులుగానూ విభజించి ప్రతి గ్రూపులో ఒక్కో సీడెడ్ ప్లేయర్‌కు చోటు కల్పిస్తారు. అలాగే డబుల్స్ విభాగంలో తలపడే క్రీడాకారులను నాలుగు గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూప్‌లో ఒక సీడెడ్ జోడీకి చోటు కల్పించడం జరుగుతుందని బిడబ్ల్యుఎఫ్ వివరించింది.
రియోలో మూడోసారి ఒలింపిక్ బరిలోకి దిగనున్న సైనా నెహ్వాల్ నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో పాటు ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం ఆమె ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో నిలువగా, సింధు 10 ర్యాంకులోనూ, శ్రీకాంత్ 11వ ర్యాంకులోనూ కొనసాగుతున్నారు. వీరితో పాటు జ్వాలా గుత్త, అశ్వనీ పొన్నప్ప, మను అత్రి, సుమిత్ రెడ్డి రియోలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
రియోలో బాడ్మింటన్ సీడింగ్స్ ఇవే
పురుషుల సింగిల్స్: 1.లీ చోంగ్ వెయ్ (మలేసియా), 2.చెన్ లాంగ్ (చైనా), 3.లిన్ దాన్ (చైనా), 4.విక్టర్ ఎక్సెల్సెన్ (డెన్మార్క్), 5.జాన్ జోర్గెనె్సన్ (డెన్మార్క్), 6.చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ), 7.టామీ సుగియార్తో (ఇండోనేషియా), 8.సన్ వాన్ హో (కొరియా), 9.కిదాంబి శ్రీకాంత్ (్భరత్), 10.హు యున్ (హాంగ్‌కాంగ్), 11.యంగ్ కా లాంగ్ (హాంకాంగ్), 12.మార్క్ జ్వెబ్లర్ (జర్మనీ), 13.రాజీవ్ ఔసెప్ (ఇంగ్లాండ్).
మహిళల సింగిల్స్: 1.కరోలినా మారిన్ (స్పెయిన్), 2.వాంగ్ ఇహన్ (చైనా), 3.లీ జెరుయి (చైనా), 4.రచనోక్ ఇతనోన్ (్థయిలాండ్), 5.సైనా నెహ్వాల్ (్భరత్), 6.నొజోమీ ఒకుహరా (జపాన్), 7.సంగ్ జీ హ్యున్ (కొరియా), 8.తై జు ఇంగ్ (చైనీస్ తైపీ), 9.పివి.సింధు (్భరత్), 10.అకానే యమగుచి (జపాన్), 11.క్రిస్టీ గిల్మోర్ (బ్రిటన్), 12.పోర్న్‌టిప్ బురనప్రసెత్సుక్ (్థయిలాండ్), 13.బే ఇయాన్ జు (కొరియా).

ఆస్ట్రేలియా ఓపెన్-2016 టైటిల్‌తో సైనా (ఫైల్ ఫొటో)