క్రీడాభూమి

ధావన్, కోహ్లీ జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 21: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా గురువారం ఇక్కడి నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా ఆచితూచి ఆడుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఆరంభంలో తడబడింది. ఓపెనర్ మురళీ విజయ్ (7) షానన్ గాబ్రియెల్ బౌలింగ్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించడంతో 14 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. అయితే నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ క్రీజ్‌లో నిలదొక్కుకుని ప్రత్యర్థులను సమర్ధవంతంగా ప్రతిఘటించాడు. స్థిమితంగా ఆడిన అతను ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారాతో కలసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. మధ్యాహ్న భోజన సమయానికి వీరిద్దరూ 58 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 72 పరుగులు సాధించింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత పుజారా (16) కేవలం 2 పరుగులు మాత్రమే సాధించి దేవేంద్ర బిషూ బౌలింగ్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్‌కు దొరికిపోవడంతో భారత జట్టు 74 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అయితే అతని స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ కోహ్లీ తనదైన శైలిలో దూకుడుగా ఆడటంతో స్కోరుబోర్డు వేగం పెరిగింది. కోహ్లీ అందించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న ధావన్ 84 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కడపటి వార్తలు అందే సమయానికి ధావన్ (75), కోహ్లీ (55) అజేయంగా 85 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది.

చిత్రం..శిఖర్ ధావన్ (75-నాటౌట్)