క్రీడాభూమి

అమెరికా ఎటిపి చాలెంజర్ క్వార్టర్స్‌కు రామ్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బింగ్‌హామ్టన్ (అమెరికా), జూలై 22: అమెరికాలో జరుగుతున్న ఎటిపి చాలెంజర్ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాడు రామనాథన్ రామ్‌కుమార్ (21) క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 214వ స్థానంలో కొనసాగుతున్న రామ్‌కుమార్ శుక్రవారం ఇక్కడి హార్డ్ కోర్టులో జరిగిన సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌కు చెందిన జోస్ స్ట్థామ్‌పై అద్భుత విజయాన్ని సాధించాడు. రెండు గంటల 22 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ సుదీర్ఘ పోరులో 2-6 తేడాతో తొలి సెట్‌ను కోల్పోయిన రామ్‌కుమార్ ఆ తర్వాత అనూహ్య రీతిలో విజృంభించాడు. ఫలితంగా 6-4, 7-6(3) తేడాతో వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని ప్రత్యర్థిని మట్టికరిపించాడు. తదుపరి మ్యాచ్‌లో రామ్‌కుమార్ ‘జెయింట్ కిల్లర్’గా పేరు పొందిన బ్రిటన్ ఆటగాడు బ్రైడన్ క్లెయిన్‌తో తలపడనున్నాడు. గత వారం డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అరంగేట్రం చేసిన రామ్‌కుమార్ చండీగఢ్‌లో జరిగిన ఆసియా/ఓషియానియా గ్రూప్-1 సింగిల్స్ మ్యాచ్‌లో దక్షిణ కొరియా ఆటగాడిని చిత్తుచేసి భారత్‌కు తొలి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే, ఎటిపి చాలెంజర్ డబుల్స్ విభాగంలో మూడో సీడ్ భాగస్వామి ఆండ్రీ గొలుబెవ్‌తో కలసి బరిలోకి దిగిన భారత ఆటగాడు నెడుంచెజియన్‌కు ఆరంభంలోనే నిరాశ ఎదురైంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో వీరు 6-7, 2-6 సెట్ల తేడాతో అన్‌సీడెడ్ జోడీ లియామ్ బ్రాడీ, గిల్హెర్మ్ క్లెజర్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.