క్రీడాభూమి

సంస్కరణల అమలుపై చర్చిద్దాం రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)ను ప్రక్షాళన చేసేందుకు అనుసరించాల్సిన మార్గాల గురించి చర్చించేందుకు వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను ఆదేశించింది. బిసిసిఐని సంస్కరించేందుకు జస్టిస్ లోధా కమిటీ చేసిన ప్రధాన సిఫారసులను సుప్రీం కోర్టు ఇటీవల ఆమోదించడంతో పాటు ఆరు నెలల వ్యవధిలోగా ఈ సిఫారసులను అమలు చేయాలని స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తమ సిఫారసుల అమలుకు అనుసరించాల్సిన మార్గాల గురించి చర్చించేందుకు వ్యక్తిగతం హాజరు కావాలని అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను లోధా కమిటీ ఆదేశించిందని, వచ్చే నెల 9వ తేదీన న్యూఢిల్లీలో ఈ సమావేశాన్ని నిర్వహించవచ్చని భావిస్తున్నామని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాబోదని, క్రికెట్ బోర్డులో చేపట్టాల్సిన సంస్కరణలపై జస్టిస్ లోధా కమిటీ స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించి, వాటిని ఎలా అమలు చేయాలన్న దానిపై బోర్డుకు అవగాహన కల్పిస్తుందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రక్షాళనకు సుప్రీం కోర్టు ఆరు నెలల గడువును నిర్ధేశించడంతో ‘తదుపరి ఆదేశాలు’ ఇచ్చే వరకూ బిసిసిఐతో పాటు దాని అనుబంధ సంఘాలన్నింటిలో ఎన్నికలను నిలిపివేయాలని జస్టిస్ లోధా కమిటీ లిఖిత పూర్వకంగా బిసిసిఐని ఆదేశించింది.

పిలుపు అందుకున్న అజయ్ షిర్కే, అనురాగ్ ఠాకూర్