క్రీడాభూమి

రష్యాను వెంటాడుతున్న ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంట్రియల్, జూలై 22: ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రీడాకారులు డోపింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలతో తీవ్రమైన అపఖ్యాతిని మూటగట్టుకున్న రష్యాను ప్రస్తుతం రియో ఒలింపిక్స్ నుంచి సంపూర్ణ నిషేధానికి గురయ్యే ప్రమాదం వెంటాడుతోంది. ఒలింపిక్స్ నుంచి తమ ట్రాక్ అండ్ ఫీల్డ్ జట్టును నిషేధించడాన్ని సవాలు చేస్తూ రష్యా చేసుకున్న అప్పీలును అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎస్‌ఎ) డిస్మిస్ చేయడంతో ఆ దేశానికి ఈ పరిస్థితి దాపురించింది. రష్యా అథ్లెటిక్ జట్టుపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) నిషేధం విధించడం సరైన చర్యేనని, నిబంధనలకు అనుగుణంగానే ఐఓసి ఈ నిర్ణయం తీసుకుందని, కనుక ఈ నిర్ణయం చెల్లుబాటవుతుందని సిఎస్‌ఎ గురువారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడల నుంచి రష్యాను పూర్తిగా నిషేధించాలా? లేక ఆ దేశ అథ్లెటిక్ జట్టుకు మాత్రమే నిషేధాన్ని పరిమితం చేయాలా? అనే ప్రస్తుతం తీవ్రస్థాయిలో అంశంపై మల్లగుల్లాలు పడుతున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ వ్యవహారంలో సిఎస్‌ఎ తీర్పును ఆధారంగా చేసుకునే తుది నిర్ణయం తీసుకోవచ్చని పలువురు విశే్లషిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఐఓసి కార్యనిర్వాహక బోర్డు ఆదివారం మరింత విస్తృతంగా చర్చలు జరుపుతుందని, ఆ తర్వాత ఒలింపిక్స్ నుంచి రష్యాను పూర్తిగా నిషేధించాలా? లేదా? అనే విషయంపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఒలింపిక్ కమిటీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదిలావుంటే, ఈ వ్యవహారంలో ఐఓసి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) విజ్ఞప్తి చేసింది. రష్యా అథ్లెట్లపై నిషేధాన్ని సమర్ధిస్తూ అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పు ‘సంతృప్తికరం’గా ఉందని, రియో ఒలింపిక్స్‌లో అక్రమాలకు తావు లేకుండా నిరోధించేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని ‘వాడా’ పేర్కొంది.