క్రీడాభూమి

మాంచెస్టర్ యునైటెడ్‌కు వాన్ గాల్ గుడ్‌బై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 27: మాంచెస్టర్ యునైటెడ్ మేనేజర్ లూయిస్ వాన్ గాల్‌ను కష్టాలు చుట్టుముట్టాయి. సౌతాంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆర్సెనల్‌తో ఢీకొన్న మాంచెస్టర్ 0-4 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. గత ఏడు మ్యాచ్‌ల్లో ఈ జట్టు ఒక్క విజయాన్ని కూడా సాధించలేదు. పైగా వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. 1989-90 సీజన్ తర్వాత ఆ జట్టు ఇంతలా విఫలం కావడం ఇదే మొదటిసారి. ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం ఒక సమస్యకాగా, క్రమశిక్షణ రాహిత్యం కూడా జట్టును వేధిస్తున్నది. అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన వాన్ గాల్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అతనిని తక్షణమే తొలగించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నది. యాజమాన్యం తొలగించే కంటే ముందు తానే వైదొలగితే బాగుంటుందని వాన్ గాల్ అనుకుంటున్నాడు. మాంచెస్టర్ యునైటెడ్‌ను వీడే అవకాశాలు లేకపోలేదని ప్రకటించి, కొత్త ఊహాగానాలకు తెరతీశాడు. ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ లీగ్‌లో కనీసం క్వార్టర్స్ కూడా చేరకుండానే మాంచెస్టర్ యునైటెడ్ నిష్క్రమించడం కూడా వాన్ గాల్‌పై ఒత్తిడిని పెంచుతున్నది. ఇదే విషయాన్ని అతను పరోక్షంగా ప్రస్తావిస్తూ, వైఫల్యాలకు తానే బాధ్యత వహిస్తున్నట్టు చెప్పాడు. ఎప్పుడు రాజీనామా చేస్తారన్న ప్రశ్నకు అతను సమాధానం చెప్పకుండా దాట వేశాడు. ‘వేచి చూడండి’ అంటూ ఈ విషయంపై ఇంతకంటే ఎక్కువ వివరాలు ఇవ్వలేనని అన్నాడు.

ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న వాన్ గాల్