క్రీడాభూమి

బాస్కెట్‌బాల్ మాజీ రిఫరీ సుబ్రమణియన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 23: మాజీ అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ రిఫరీ టిపి.సుబ్రమణియన్ శనివారం ముంబయిలో కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న సుబ్రమణియన్ నెల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది గత వారమే ఇంటికి తిరిగి వచ్చారని, గురువారం ఉదయం ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు శనివారం వెల్లడించాడు. కేంద్ర ఎక్సైజ్ విభాగంలో డిప్యుటీ కమిషనర్‌గా పదవీ విరమణ పొందిన సుబ్రమణియన్ ఆసియా క్రీడల్లో సైతం రిఫరీగా వ్యవహరించారు. ఆటలో క్రమశిక్షణను, నియమ నిబంధనలను అమలు చేయడంలో మేటి రిఫరీగా ఖ్యాతి పొందిన సుబ్రమణియన్ 1970వ దశకం చివర్లో జరిగిన ఒక మ్యాచ్‌లో అప్పటి భారత జట్టు కెప్టెన్ అబ్బాస్ మూంతాసిర్ వాగ్వాదానికి దిగడంతో ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆయనను మైదానం నుంచి బయటికి పంపేశాడు. ఆ తర్వాత ఈ చర్య అబ్బాస్‌తో పాటు పశ్చిమ రైల్వే జట్టులోని అతని సహచరుడైన దివంగత జావెద్ అక్తర్‌పై మహారాష్ట్ర బాస్కెట్‌బాల్ సంఘం కొనే్నళ్ల పాటు నిషేధం విధించేందుకు దారితీసింది. అప్పట్లో ఆసియాలోని మేటి ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్న మూంతాసిర్‌పై నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత అతను మళ్లీ బరిలోకి దిగినప్పటికీ హూప్‌స్టర్‌గా పేరు పొందిన అక్తర్ కెరీర్ ఈ నిషేధంతోనే ముగిసింది.