క్రీడాభూమి

క్వార్టర్ ఫైనల్స్ వలన మనకు మేలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 23: రియో ఒలింపిక్స్‌లో నేరుగా సెమీ ఫైనల్స్ కాకుండా మధ్యలో క్వార్టర్ ఫైనల్స్‌ను ప్రవేశపెడుతూ పోటీ ఫార్మాట్‌లో మార్పులు చేయడం భారత్‌తో పాటు మరి కొన్ని చిన్న టీములకు కూడా లాభదాయకమని భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ అభిప్రాయ పడ్డాడు. ‘గ్రూపులో అర్జెంటీనా, జర్మనీ, హాలాండ్ లాంటి జట్లు ఉన్నప్పుడు టాప్ టూ జట్లుగా నిలవడం చాలా కష్టం. అది అసాధ్యం కాకపోవచ్చు కానీ ఇప్పుడు టాప్ ఫోర్‌లో ఒకటిగా నిలవడం వల్ల క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడే అవకాశం లభిస్తుంది’ అని ఓల్ట్‌మన్స్ శుక్రవారం ఇక్కడి ‘సాయ్’ సౌత్ సెంటర్‌లో పిటిఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నాడు. ఈ ఫార్మాట్ వల్ల భారత్‌కేకాకుండా కెనడా లాంటి మిగతా జట్లకు కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశముంటుందని ఆయన అన్నాడు.
ఇంతకు ముందు ఒలింపిక్స్‌లో గ్రూపు మ్యాచ్‌ల తర్వాత నేరుగా సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లు మాత్రమే జరిగేవి. అయితే ఈ ఏడాది రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌ను కూడా ప్రవేశపెట్టాలని అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్) నిర్ణయించింది. కొత్త ఫార్మాట్ ప్రకారం ఒలింపిక్స్‌కు అర్హత పొందిన 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి జట్టు తమ గ్రూపులోని జట్లతో రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు ఆడతాయి. ఆ తర్వాత ప్రతి గ్రూపులోను టాప్ ఫోర్ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత పొందుతాయి. ఇంతకు ముందయితే రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ప్రతి గ్రూపులోను తొలి రెండు స్థానాల్లో వచ్చిన జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత పొందేవి.
కాగా, ఒలింపిక్స్‌కోసం హాకీ ఇండియా చాలాకాలంగా కెప్టెన్‌గా ఉండిన సర్దార్ సింగ్ స్థానంలో గోల్‌కీపర్ శ్రీజేష్‌ను జాతీయ జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేయడం తెలిసిందే. కాగా, ఈ మార్పు గురించి ఓల్ట్‌మన్స్‌ను అడగ్గా, సర్దార్ సింగ్‌ను అదనపు బాధ్యతలనుంచి విముక్తి చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పాడు. ఇప్పుడు సర్దార్ పూర్తిగా తన ఆటపై దృష్టిపెట్టడానికి వీలవుతుంది. సర్దార్ స్థానంలో శ్రీజేశ్‌ను కెప్టెన్‌గా నియమించే విషయాన్ని తాము చర్చించినప్పుడు తమ దృష్టిలోఉన్నది ఇదే విషయమని కూడా ఆయన స్పష్టం చేశాడు. ‘వైస్ కెప్టెన్ ఎస్‌వి సునీల్, విఆర్ రఘునాథ్, మన్‌ప్రీత్ సింగ్, శ్రీజేశ్‌లతో కలిసి ఒక గ్రూప్ ఆఫ్ కెప్టెన్స్ ఏర్పడుతుంది. ఇది ఒక మంచి సానుకూల పరిణామం అవుతుందని నేను భావిస్తున్నాను’ అని ఓల్ట్‌మన్స్ చెప్పాడు. 16 మంది సభ్యులున్న భారత జట్టులో 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆడిన ఏడుగురు ఆటగాళ్లుండగా, తొమ్మిది మంది కొత్తవాళ్లున్నారు. లండన్ ఒలింపిక్స్‌లో ఆడిన సీనియర్లు తమ అనుభవాలను మిగతా వాళ్లతో పంచుకుంటున్నారా అని అడగ్గా, అయితే దురదృష్టవశాత్తు ఆ ఒలింపిక్స్ భారత్‌కు అంత గొప్ప ఫలితాలనివ్వలేదని, అందువల్ల నెగెటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు. దానికి బదులు తాను తన ఒలింపిక్ అనుభవాలను ఆటగాళ్లతో పంచుకుంటున్నట్లు చెప్పాడు.

చిత్రం.. హాకీ జట్టు కెప్టెన్ శ్రీజేష్‌తో చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్