క్రీడాభూమి

తరచుగా కెప్టెన్లను మార్చడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 23: భారత హాకీ జట్టు సారథులను తరచుగా మార్చడం సరైన పద్ధతి కాదని, ఇది తర్కానికి విరుద్ధమని మాజీ కెప్టెన్, ఒలింపియన్ గురుబక్ష్ సింగ్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత హాకీ ఆటగాడిగా చరిత్రకెక్కడంతో పాటు ప్రతిష్టాత్మకమైన సుల్తాన్ అజ్లన్‌షా హాకీ టోర్నమెంట్‌లో భారత్‌కు రజత పతకాన్ని అందించిన సర్దార్ సింగ్‌కు ‘విశ్రాంతి’ కల్పించి ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో రజత పతకాన్ని సాధించిన భారత జట్టుకు నాయకత్వం వహించిన గోల్‌కీపర్ పిఆర్.శ్రీజేష్ (28) రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు సారథిగా నియమించిన నేపథ్యంలో గురుబక్ష్ సింగ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయంలో తాను ఎవరినీ నిందించడం లేదని, ఒలింపిక్స్ లాంటి అతిపెద్ద ఈవెంట్‌లో భారత జట్టుకు ఎవరు సారథ్యం వహించాలన్న విషయంపై కనీసం ఒక సంవత్సరం ముందైనా నిర్ణయం తీసుకుని జట్టు మరింత స్థిరంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని గురుబక్ష్ సింగ్ (80) పిటిఐ వార్తా సంస్థతో అన్నాడు.

చిత్రం.. గురుబక్ష్ సింగ్