క్రీడాభూమి

సత్తా చాటిన బోల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 23: తొడకండరాల గాయం కారణంగా తమ దేశంలో జరిగిన ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొనలేక పోయిన జమైకా స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ వచ్చే నెల జరిగే రియో ఒలింపిక్సకు తాను పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నట్లు నిరూపించుకున్నాడు. గాయం కారణంగా చాలా రోజులుగా పోటీలకు దూరంగా ఉన్న బోల్ట్ ఇక్కడ జరుగుతున్న లండన్ వార్షిక క్రీడోత్సవాల్లో తొలిసారిగా 200 మీటర్ల పరుగుపందెంలో పాల్గొని సునాయాసంగా విజయం సాధించాడు. లండన్ ఒలింపిక్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ క్రీడోత్సవాల్లో తొలి రోజు బోల్ట్ స్టార్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అయితే బోల్ట్‌ను చూడడానికి వచ్చిన దాదాపు 40 వేల మంది ప్రేక్షకులను అతను ఎంతమాఅతం నిరాశ పర్చలేదు. 19.89 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచాడు. పనామాకు చెందిన ఆలోన్సో ఎడ్వర్డ్ 20.4 సెకన్లతో రెండోస్థానంలో నిలవగా, బ్రిటన్‌కు చెందిన ఆదమ్ గెమిల్ 20.07 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈస్ట్‌లండన్‌లోని ఈ స్టేడియంలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని బోల్ట్ ఒలింపిక్స్ సమయానికి తన ఫేవరేట్ విభాగంలో ఎదురయ్యే ఇబ్బందులన్నిటినీ అధిగమించగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. తన ఒలింపిక్స్ టైటిల్స్‌ను నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పాడు. కాగా, అమెరికా మహిళల హర్డిల్స్ జట్టులో స్థానం పొందలేక పోయిన కెండ్రా హారిసన్ వందమీటర్ల హర్డిల్స్‌లో 28 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి తనను ఎంపిక చేయడం ఎంత తప్పో సెలెక్టర్లకు గుర్తు చేసింది. 1988లో బల్గేరియాకు చెందిన యోర్డాంకా నెలకొల్పిన 12.21 సెకన్ల రికార్డును ఆమె 0.01 సెకన్ల తేడాతో బద్దలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.

చిత్రం.. హర్డిల్స్‌లో రికార్డు సృష్టించిన హారిసన్