క్రీడాభూమి

కెప్టెన్ ధోనీకి చివరి అవకాశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధోనీ అత్యంత రక్షణాత్మకంగా వ్యవహరించే కెప్టెన్‌గా ముద్రపడ్డాడు. ప్రత్యర్థి జట్లపై దాడులకు ఉపక్రమించేందుకు అతను ఇష్టపడడు. ఈ లక్షణమే చాలా సందర్భాల్లో టీమిండియాది పైచేయిగా ఉన్న మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి జట్టు నిలదొక్కుకొని ఎదురుదాడికి దిగే అవకాశాన్ని కల్పించిందన్న విమర్శలున్నాయి. 2011-12 సీజన్‌లోనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లను ఢీకొన్న భారత జట్టు దారుణ పరాజయాలను ఎదుర్కొన్న తర్వాత ధోనీ కెప్టెన్సీపై చర్చ మొదలైంది. మైదానంలో అతని వ్యవహార శైలి టీమిండియా కంటే ఎదుటి జట్లకే ఎక్కువ ప్రయోజనం చేకూర్చేవిగా మారుతున్నాయని చాలా మంది ధ్వజమెత్తారు. కానీ, అతను తన విధానాలను మార్చుకోలేదు.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే భారత వనే్డ, టి-20 ఫార్మెట్స్‌కు మహేంద్ర సింగ్ ధోనీనే కెప్టెన్‌గా కొనసాగించాలని జాతీయ సెలక్షన్ కమిటీ నిర్ణయంచడం ఊహించని పరిణామమేమీ కాదు. టెస్టు క్రికెట్ నుంచి ధోనీ వైదొలగిన కారణంగా విరాట్ కోహ్లీకి ఆ ఫార్మెట్‌లో నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పామేగానీ ధోనీ పట్ల తమకు ఎలాంటి వ్యతిరేక లేదని సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ చెప్పకనే చెప్పాడు. టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లోనూ ధోనీ నాయకత్వమే కొనసాగుతుందని అతను స్పష్టం చేశాడు. అంతటితో ఆగకుండా, తాము ఎవరి కెప్టెన్సీలో ఆడుతున్నామన్న విషయంపై జట్టులోని ఆటగాళ్లందరికీ స్పష్టత ఉండాలని వ్యాఖ్యానించాడు. దీనితో, పొట్టి ఫార్మెట్స్‌లోనూ కోహ్లీ నాయకత్వం ఉండాలన్న కొంత మంది ఆటగాళ్ల డిమాండ్‌ను అతను పరోక్షంగా ప్రస్తావించినట్టయంది. ఇవే వ్యాఖ్యలు మరో రకంగా ధోనీపైనా ఒత్తిడి పెంచేవిగా ఉన్నాయ. సెలక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతను అతను స్వీకరించక తప్పని పరిస్థితి. కెప్టెన్‌గానే కాక ఆటగాడిగానూ తన సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం కూడా అతనికి ఉంది. కాగా, సెలక్టర్ల నిర్ణయం ధోనీకి చివరి అవకాశం ఇవ్వడమనే కోణం నుంచి కూడా చూడవచ్చు. టి-20 వరల్డ్ కప్ సమీపిస్తున్న కారణంగా ఇప్పుడు కెప్టెన్‌ను మార్చడం ద్వారా ప్రయోగాలు చేయవద్దని సెలక్టర్లు భావించి ఉండవచ్చు. అదే సమయంలో అన్ని ఫార్మెట్స్‌లోనూ కోహ్లీకే పగ్గాలు అప్పచెప్పాలన్న డిమాండ్‌ను సరైన సమాధానం చెప్పడం కూడా వారి ఆంతర్యం కావచ్చు. ఆసీస్ టూర్‌లో, ఆతర్వాత టి-20 వరల్డ్ కప్‌లో ధోనీ విఫలమైతే, ఆతర్వాత అతనిని కెప్టెన్సీ నుంచి తప్పించినా ఎలాంటి సమస్యలు ఎదురుకావన్న ఆలోచన ఉన్నా ఆశ్చర్యం లేదు. ఏ కోణంలో చూసినా కెప్టెన్‌గా ధోనీకి ఇది చివరి అవకాశంగా కనిపిస్తున్నది. నిన్నమొన్నటి ఆటగాడు కోహ్లీతో తనను పోల్చడంపై ఇప్పటికే పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసిన ధోనీకి తాను కూడా సమర్థుడేనని, భారత జట్టుకు విజయాలను అందించే సామర్థ్యం తనకు ఉందని నిరూపించుకోక తప్పదు. ఇలావుంటే, కోహ్లీ, ధోనీ మధ్య ఆధిపత్య పోరాటం, విభేదాలు కొత్త కాదు. జట్టులోని సభ్యులే కాకుండా, అభిమానులు కూడా వీరిద్దరినీ పోల్చి చూడడం కూడా చాలాకాలంగా కొనసాగుతున్నదే. ఇటీవల దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టి-20, వనే్డ సిరీస్‌లకు ధోనీ నాయకత్వం వహించాడు. ఈ రెండు ఫార్మెట్స్‌లోనూ టీమిండియా దారుణంగా విఫలమైంది. సిరీస్‌లను చేజార్చుకుంది. అయతే, ఆ వెంటనే జరిగిన టెస్టు సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచింది. కోహ్లీ నాయకత్వంలో యావత్ జట్టు స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. బెంగళూరు టెస్టులో నాలుగు రోజుల ఆట వర్షం కారణంగా రద్దుకావడంతో అది డ్రా అయంది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయభేరి మోగించింది. సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన జ్ఞాపకాలు, సాధించిన ఘన విజయం సంబరాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే ఆస్ట్రేలియా టూర్‌కు టి-20, వనే్డ జట్లు ఎంపిక కావడంతో మరోసారి కోహ్లీ, ధోనీ మధ్య పోలిక తెరపైకి వచ్చింది. మైదానంలో కోహ్లీ దూకుడుగా వ్యవహరిస్తే, ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడూ సంయమనం కోల్పోడు కాబట్టే ధోనీ ‘మిస్టర్ కూల్’గా ముద్రపడ్డాడు. ఈ కోణంలో చూస్తే ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనాన్ని కోరుతూ, ప్రయోగాలు చేస్తూ, దూకుడుగా ఉంటే కోహ్లీని ‘మిస్టర్ అగ్రెషన్’ అని పిలవక తప్పదు.
పరోక్ష విమర్శలు
దూకుడు అంటే ప్రత్యర్థులతో మాటామాటా అనుకోవడం కాదని, ఘర్షణకు దిగడం, నవ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం అంతకంటే కాదని వ్యాఖ్యానించడం ద్వారా కోహ్లీపై ధోనీ పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించాడు. అంతకు ముందు, ఆస్ట్రేలియా టూర్‌లో ధోనీ తీసుకున్న పలు నిర్ణయాలను కోహ్లీ బాహాటంగానే విమర్శించాడు. ఇద్దరి మధ్య సయోధ్య అంతంత మాత్రమేనని చెప్పడానికి ఈ రెండు సంఘటనలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇద్దరూ మీడియాకు ఎక్కడం, ఎదో ఒక రకంగా పరస్పరం విమర్శలు చేసుకోవడం ఆనవాయతీగా మారింది. ఇటీవల కాలంలో ధోనీ వైఫల్యాలు అతని అభిమానులను సైతం నిరాశకు గురి చేస్తున్నాయ. ధోనీ నాయకత్వంలో భారత జట్టు ఈ ఏడాది ఒక్క సిరీస్‌ను కూడా గెల్చుకోలేకపోయింది. జనవరి మాసంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా పాల్గొన్న ముక్కోణపు వనే్డ సిరీస్‌లో పరాజయాన్ని ఎదుర్కొంది. ఆతర్వాత ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్స్ నుంచే వెనుదిరిగింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ ఫైనల్ చేరలేకపోవడం అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా ధోనీని దురదృష్టం వెంటాడుతునే ఉంది. బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లి, అక్కడ ద్వైపాక్షిక సిరీస్‌లో ఓడింది. టీమిండియాపై బంగ్లాదేశ్‌కు అదే తొలి విజయం కావడం గమనార్హం. ధోనీ వైఫల్యాలు స్వదేశంలోనూ కొనసాగాయ. దక్షిణాఫ్రికాతో చేతిలో టి-20 సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. వనే్డ సిరీస్‌లో 2-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ధోనీ నాయకత్వంపై అపనమ్మకాలను పెంచుతున్నది. అతనిని విమర్శిస్తున్న వారంతా కోహ్లీ విజయాలను ప్రస్తావిస్తున్నారు. ధోనీని తప్పించి, అతని స్థానంలో పొట్టి ఫార్మెట్స్‌కు కూడా అతనినే కెప్టెన్‌గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, తాను జట్టును సమర్థంగా నడిపించగలనని, చిరస్మరణీయ విజయాలను అందించగలనని నిరూపించుకునే ప్రయత్నం ధోనీ చేయడం ఖాయం.

కెప్టెన్‌గా చివరి పర్యటన?
టీమిండియా సారథి ధోనీ