క్రీడాభూమి

తప్పుకోనున్న శరద్ పవార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 24: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు( బిసిసిఐ) దాని అనుబంధ సంగాల్లో సమూల మార్పులను తీసుక రావాలంటూ జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫార్సులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఏ) ఆదివారం యథాతథంగా ఆమోదించింది. దీంతో ముంబయి క్రికెట్ సంఘం అధ్యక్ష పదవినుంచి శరద్ పవార్ తప్పుకోవలసి ఉంటుంది. పవార్ బిసిసిఐ అధ్యక్షుడిగా, ఐసిసి అధ్యక్షుడిగా కూడా పని చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఎంసిఏ మేనేజింగ్ కమిటీ సమావేశం తర్వాత జరిగిన విలేఖరుల సమావేశంలో 75 ఏళ్ల శరద్ పవార్ మాట్లాడుతూ, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ల వయసు 70 ఏళ్లకు మించరాదని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పును తాను అంగీకరిస్తున్నట్లు చెప్పారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి ఎంసిఏకు ఆరు నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు. అంటే పవార్ ఇప్పటికిప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు. న్యాయ వ్యవస్థను తాను గౌరవిస్తానని, క్రికెట్ పాలనా వ్యవహారాలనుంచి సంతోషంగా తప్పుకుంటానని ఆయన చెప్పారు. బిసిసిఐ అధ్యక్షుడిగా, ఎంసిఏ చైర్మన్‌గా తాను ఉన్న సమయంలో క్రికెట్‌కు తోడ్పడే చాలా సంఘటనలు జరగడం అందరికీ తెలుసునని పవార్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎంసిఏ తన రాజ్యాంగాన్ని తిరిగి రూపొందించే ప్రక్రియను చేపడుతుందని ఆయన అంటూ, ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పారు. క్రికెట్ అడ్మినిస్ట్రేర్లకు 70 ఏళ్ల వయో పరిమితితో పాటు ఆఫీసు బేరర్‌గా 9 ఏళ్లకు మించి ఉండరాదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం పవార్ ఎంసిఏ అధ్యక్ష పదవినుంచి తప్పుకుని తీరాల్సి ఉంటుంది. అయితే ఒక రాష్ట్రం, ఒక పదవి అనే దానిపై కాస్త స్పష్టత అవసరమని ఆయన అన్నారు. మహారాష్టల్రో ముంబయి క్రికెట్ సంఘం, విదర్భ క్రికెట్ సంఘం, మహారాష్ట్ర క్రికెట్ సంఘం ఉన్నాయని, ఒక రాష్ట్రం, ఒక ఓటును గనుక అమలు చేయాల్సి వస్తే ఈ సంఘాలన్నీ ఒకటిగా విలీనం కావలసి ఉంటుందని, లేదా రొటేషన్ పద్ధతిని పాటించాల్సి ఉంటుందని పవార్ అన్నారు. కాగా తనతో పాటుగా ఎంసిఏలోని దాదాపు అందరు సభ్యులపైన ఈ తీర్పు ప్రభావం ఉంటుందని పవార్ చెప్పారు. అయితే ముంబయిలో సమర్థులకు కొదువ లేదని ఆయన అన్నారు. అయితే ఈ తీర్పును అమలు చేయడం బిసిసిఐకి కూడా కష్టమవుతుందని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వ ప్రతినిధులెవరు కూడా క్రికెట్ సంఘాల్లో సభ్యులుగా ఉండకూడదని తీర్పు స్పష్టంగా పేర్కొంటోందని, అయితే బిసిసిఐలో సర్వీసెస్,యూనివర్శిటీలు, రైల్వేలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారని పవార్ అన్నారు. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా తాను ఎన్నో సాధించానని చెప్తూ, బిసిసిఐ అధ్యక్షుడిగా ఆటగాళ్లకు, అంపైర్లకు పెన్షన్ పథకాన్ని ప్రారంభించామని, తన హయాంలోనే బిసిసిఐ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరిగిందని తెలిపారు.

రష్యా అథ్లెట్లపై వేటుకు
ఐఓసి వ్యతిరేకత
ఒలింపిక్స్‌కు అనుమతిపై
క్రీడా సంఘాలకు స్వేచ్ఛ
లాసానే్న, జూలై 24: రష్యా ప్రభుత్వమే డోపింగ్‌ను ప్రోత్సహించిందన్న ఆరోపణపై ఆ దేశానికి చెందిన అథ్లెట్లను పూర్తిగా నిషేధించడంపై ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) రష్యా అథ్లెట్లు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనాలా వద్దా అనే దానిపై ఆయా క్రీడా సంఘాలే నిర్ణయం తీసుకోవాలని ఆదివారం స్పష్టం చేసింది. వచ్చే నెల 5న ప్రారంభమయ్యే రియో ఒలింపిక్స్‌కు వెళ్లాలని ఏ రష్యా అథ్లెటయినా నిర్ణయించుకుంటే డోపింగ్‌తో తనకెలాంటి సంబంధం లేదని అతను లేదా ఆమె నిరూపించుకోవలసి ఉంటుందని ఐఓసి ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. కాగా, రష్యా అథ్లెట్ల డోపింగ్ వ్యవహారాన్ని బైటపెట్టిన 800 మీటర్ల రన్నర్ యులియా స్ట్ఫెనోవాను తటస్థ అథ్లెట్‌గా కూడా రియో ఒలిపిక్స్‌కు వెళ్లడానికి అనుమతించకూడదని ఐఓసి ఎధిక్స్ కమిటీ స్పష్టం చేసింది.