క్రీడాభూమి

అదే నిజమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 25: డోపింగ్ వ్యవహారంలో రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు వ్యతిరేకంగా కుట్ర జరిగిందన్న అనుమానాలు క్రమేణా బలపడుతున్నాయి. సోనేపట్ (హర్యానా)లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణా శిబిరంలో నర్సింగ్‌తో కలసి ఒకే గదిలో ఉంటున్న మరో రెజ్లర్ సందీప్ యాదవ్ కూడా డోపింగ్ పరీక్షలో విఫలమవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చడంతో పాటు నర్సింగ్‌కు వ్యతిరేకంగా కుట్ర జరిగిందన్న విషయం స్పష్టమవుతోందని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) పేర్కొంది. ‘నర్సింగ్ రూమ్‌మేట్ సందీప్ యాదవ్ కూడా డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. ఒకే గదిలో కలసి ఉంటున్న వీరిద్దరి నుంచి సేకరించిన నమూనాల్లో ఒకే రకమైన నిషిద్ధ ఉత్ప్రేరకం ఉన్నట్లు పరీక్షల్లో తేలడం దీని వెనుక కుట్ర ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇది తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తోంది’ అని డబ్ల్యుఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్ తొమర్ వెల్లడించారు. ‘నర్సింగ్, సందీప్ నుంచి సేకరించిన నమూనాల్లో నమ్మశక్యం కానంత ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్ అవశేషాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఎవరైనా ఇంత ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్‌ను ఎందుకు తీసుకుంటారు?’ అని తొమర్ ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తుంటే ఈ వ్యవహారం వెనుక ఉద్దేశ్యపూర్వకమైన కుట్ర దాగి ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. సాయ్ శిక్షణా శిబిరంలో ఇంకెవరైనా డోపింగ్ పరీక్షలో విఫలమయ్యారా? అని తొమర్‌ను ప్రశ్నించగా, లేదని తొమర్ తెలిపారు. ‘సాయ్ శిక్షణా శిబిరంలో నర్సింగ్, సందీప్ తప్ప మరెవరూ డోపింగ్ పరీక్షలో విఫలమవలేదు. దీనిని బట్టి కూడా ఈ వ్యవహారంలో ఏదో తప్పు జరిగిందని స్పష్టమవుతోంది’ అని తొమర్ చెప్పాడు.
ఇది కుట్రే : డబ్ల్యుఎఫ్‌ఐ
ఇదిలావుంటే, ఈ వ్యవహారంలో నర్సింగ్ యాదవ్‌కు డబ్ల్యుఎఫ్‌ఐ బాసటగా నిలిచింది. నర్సింగ్ అమాయకుడని, ఎటువంటి తప్పూ చేయని అతడిపై ఎవరో కుట్ర పన్ని డోపింగ్ కుంభకోణంలో ఇరికించారని డబ్ల్యుఎఫ్‌ఐ పేర్కొంది. నర్సింగ్ అమాయకుడని, అతడికి వ్యతిరేకంగా కుట్ర జరిగిందని గట్టిగా నమ్ముతున్న రెజ్లింగ్ సమాఖ్య నర్సింగ్‌కు అండగా నిలుస్తుందని డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పష్టం చేశాడు. ఎటువంటి మచ్చ లేకుండా నర్సింగ్ ఎంతో స్వచ్ఛమైన రికార్డును కలిగి ఉన్నాడని, ఒలింపిక్ క్రీడలకు సమయం సమీపిస్తున్న తరుణంలో నర్సింగ్ నిషిద్ధ ఉత్ప్రేరకాలను ఉపయోగించి భవిష్యత్తును నాశనం చేసుకునేంత తెలివితక్కువ వాడు కాదని బ్రిజ్ భూషణ్ సోమవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో తెలిపాడు. నర్సింగ్‌తో పాటు ఇతర రెజ్లర్లందరినీ కాపాడుకోవడం తమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశాడు.

చిత్రం.. డోపింగ్ పరీక్షలో విఫలమైన నర్సింగ్ సహచరుడు సందీప్ యాదవ్