క్రీడాభూమి

దెబ్బ మీద దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్న రెజ్లర్లు నర్సింగ్, సందీప్.. నేడు షాట్‌పుటర్ ఇందర్‌జీత్
డోపింగ్‌లో పట్టుబడుతున్న భారత అథ్లెట్లు

డోపింగ్ పరీక్షలో నేను విఫలమవడం వెనుక కుట్ర జరిగింది. నా నుంచి సేకరించిన శాంపిల్‌ను ట్యాంపర్ (కల్తీ) చేశారు. కచ్చితంగా ఇది కుట్రే. ఈ వ్యవహారంలో ఏదో మోసం జరిగింది. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్ధాన్ని ఎవరైనా ఎందుకు స్వీకరిస్తారు?’ ఇటువంటి మోసాలకు వైద్యులు అడ్డుకట్ట వేయాలి. ప్రస్తుతం దీనిపై నేనేమీ మాట్లాడదల్చుకోలేదు. కానీ దేశంలో ఎవరైనా గొంతెత్తి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే బలవంతంగా వారి గొంతు నొక్కేస్తున్నారు. అయనప్పటికీ సహచర క్రీడాకారుల తరఫున ధైర్యంగా మాట్లాడి తీరుతా.
- ఇందర్‌జీత్ సింగ్

న్యూఢిల్లీ, జూలై 26: రియో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న భారత క్రీడా బృందాన్ని డోపింగ్ కుంభకోణాలు తీవ్రంగా కుదిపేస్తున్నాయి. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమైన విషయం వెల్లడై రెండు రోజులు తిరక్కుండానే ఇప్పుడు షాట్‌పుటర్ ఇందర్‌జీత్ సింగ్ కూడా నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని ఉపయోగించినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో రియో ఒలింపిక్స్‌కు పట్టుమని పది రోజుల సమయం కూడా లేకముందే భారత క్రీడా బృందానికి దెబ్బ మీద దెబ్బ తగిలింది. అయితే ఈ పరీక్షల కోసం తన నుంచి సేకరించిన శాంపిల్‌ను ట్యాంపర్ (కల్తీ) చేశారని ఇందర్‌జీత్ సింగ్ ఆరోపించాడు. 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఇంద్రజీత్ నుంచి సేకరించిన ఏ శాంపిల్‌ను గత నెల 22వ తేదీన పరీక్షించగా, అతను ఆండ్రోస్టెరాన్, ఎటియోకొలనోలోన్ అనే స్టెరాయిడ్లను ఉపయోగించినట్లు వెల్లడయిందని, దీంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఈ విషయాన్ని ఇందర్‌జీత్‌కు తెలియజేసిందని అధికార వర్గాలు పిటిఐ వార్తా సంస్థకు తెలిపాయి. ఈ వ్యవహారంలో బి శాంపిల్‌ను ఇంకా పరీక్షించాల్సి ఉన్నందున ఇందర్‌జీత్ పేరును ధ్రువీకరించేందుకు నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ నిరాకరించారు. అయితే గత నెలలో ఇందర్‌జీత్ పత్తా లేకుండా పోయాడని నవీన్ అగర్వాల్ వెల్లడించాడు. ‘గత నెలలో ఇందర్‌జీత్ ఎక్కడికో వెళ్లిపోయి పరీక్ష నుంచి తప్పించుకున్నాడు. ఇప్పటివరకూ రెజ్లర్లు నర్సింగ్ యాదవ్, అతని సహచరుడు సందీప్ యాదవ్ మాత్రమే డోపింగ్ పరీక్షల్లో విఫలమయ్యారు. ఇందర్‌జీత్ విషయంలో నేనేమీ చెప్పలేను’ అని నవీన్ అగర్వాల్ పేర్కొన్నాడు. ఇందర్‌జీత్ వ్యవహారంపై క్రమశిక్షణా కమిటీ బుధవారం విచారణ జరుపనుందని, ఈ విచారణ పట్ల అతను సంతృప్తి చెందకపోతే నాడా అప్పీల్స్ కమిటీని ఆశ్రయించవచ్చని అగర్వాల్ తెలిపాడు. కమిటీకి క్రీడాకారులు సహకరిస్తే విచారణ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని ఆయన చెప్పాడు.
ప్రస్తుతం ఇందర్‌జీత్ బి శాంపిల్‌కు పరీక్ష నిర్వహించాల్సి ఉందని, ఇందుకు అతను ఇష్టపడితే ఏడు రోజుల వ్యవధిలోగా ఈ పరీక్ష చేయించుకోవాలని నాడా స్పష్టం చేసింది. బి శాంపిల్ పరీక్షలో కూడా ఇందర్‌జీత్ విఫలమైతే అతను రియో ఒలింపిక్స్‌కు దూరం కావడంతో పాటు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) కొత్త నిబంధనల ప్రకారం నాలుగేళ్ల పాటు నిషేధానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
శాంపిల్‌ను ట్యాంపర్ చేశారు : ఇందర్‌జీత్
ఇదిలావుంటే, డోపింగ్ పరీక్షలో తాను విఫలమవడం వెనుక కుట్ర జరిగిందని, తన నుంచి సేకరించిన ఏ శాంపిల్‌ను ట్యాంపర్ (కల్తీ) చేశారని ఇందర్‌జీత్ సింగ్ ఆరోపించాడు. ‘కచ్చితంగా ఇది కుట్రే. ఈ వ్యవహారంలో ఏదో మోసం జరిగింది. ఇటువంటి మోసాలకు వైద్యులు అడ్డుకట్ట వేయాలి. దీనిపై నేనేమీ మాట్లాడదల్చుకోలేదు. కానీ ఈ దేశంలో ఎవరైనా గొంతెత్తి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే బలవంతంగా వారి గొంతు నొక్కేస్తున్నారు. నా నుంచి సేకరించిన శాంపిల్‌ను ట్యాంపర్ చేశారు. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్ధాన్ని ఎవరైనా ఎందుకు ఉపయోగిస్తారు?’ అని ఇందర్‌జీత్ వాపోయాడు.
జాతీయ శిక్షణా శిబిరానికి అంతగా హాజరుకాని ఇందర్‌జీత్ వ్యక్తిగతంగా కోచ్‌ను నియమించుకుని సొంతగా శిక్షణ పొందుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ప్రస్తుతం తన నోరు నొక్కేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంలో తన తదుపరి చర్య ఏమిటన్నదీ ఇప్పుడే వెల్లడించడం తొందరపాటు చర్యే అవుతుందని ఇందర్‌జీత్ చెప్పాడు. ‘ప్రస్తుతానికి నేనేమీ మాట్లాడే స్థితిలో లేను. కానీ మన దేశంలో ఒక క్రీడాకారుడిని నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వాదనను నేను గట్టిగా సమర్ధించుకుంటా. గత ఏడాది దాదాపు 50 సార్లు డోపింగ్ పరీక్షలు చేయించుకున్న నేను ఈ ఏడాది కూడా ప్రతిసారీ పరీక్షలు చేయించుకున్నా. నా నోరు నొక్కేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ దేశంలోని క్రీడాకారుల తరఫున ధైర్యంగా మాట్లాడుతా. గత ఏడాది కాలం నుంచి ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి ఆటగాళ్లను కలవరపెడుతున్నాయి’ అని ఇందర్‌జీత్ స్పష్టం చేశాడు.
రియో ఒలింపిక్స్‌కు తొలుత అర్హత సాధించిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లలో ఇందర్‌జీత్ ఒకడు. గత ఏడాదే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఇందర్‌జీత్ సింగ్ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన టిఓపి (టార్గెట్ పోడియం ఫినిష్) పథకం కింద నిధులు పొంది ఈ ఏడాది ఆరంభంలో అమెరికాలో శిక్షణ పొందాడు.