క్రీడాభూమి

విచారణకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ) తత్కాలిక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ స్పష్టం చేశాడు. ప్రస్తుత కేంద్ర మంత్రి అరుణ్ జైటీ డిడిసిఎ అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో భారీగా అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం చోటు చేసుకుందని బిజెపి నుంచి సస్పెన్షన్‌కు గురైన కీర్తీ ఆజాద్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించాడు. కాగా, ప్రభుత్వ నిర్ణయంపై తమకు ఏ విధమైన అభ్యంతరాలు లేవని చేతన్ చౌహాన్ అన్నాడు. పాలనా వ్యవహారాలు పారదర్శకంగా ఉన్నాయని, కాబట్టి విచారణకు భయపడాల్సిన అవసరమే తమకు లేదని బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. డిడిసిఎలో అక్రమాలు, అవినితి జరిగినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.
షూటింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్
బింద్రా దూరం
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతను సంపాదించడానికి ఉద్దేశించిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ షూటింగ్ ఈవెంట్‌లో ఏస్ షూటర్ అభినవ్ బింద్రా పాల్గొనడం లేదు. దేశం నుంచి మరో షూటర్‌కు అవకాశం ఇచ్చే ఉద్దేశంతో తాను ఈ ఈవెంట్ నుంచి వైదొలగుతున్నానని అతను గురువారం ప్రకటించాడు. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి వచ్చే ఏడాది రియోలో జరిగే ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం లభిస్తుంది. అయితే, ఈఏడాది ఇతర ఈవెంట్స్‌లో అద్భుతంగా రాణించిన బింద్రా ఇప్పటికే రియోకు క్వాలిఫై అయ్యాడు. ఆసియా క్వాలిఫయర్స్‌లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా అతనికి వచ్చే నష్టం లేదు. ఒకవేళ బింద్రా వైదొలిగితే, మన దేశం నుంచి మరో షూటర్‌కు ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం లభించవచ్చు. ఈ కారణంగానే తాను పాల్గొనబోనని బింద్రా తెలిపాడు.
నాలుగో వనే్డకి
మెక్‌కలమ్ డౌటే!
నెల్సన్, డిసెంబర్ 30: శ్రీలంకతో గురువారం జరిగే నాలుగో వనే్డలో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. మంగళవారం నాటి మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు బౌండరీ వద్ద ఒక బంతిని అపేందుకు ప్రయత్నించే క్రమంలో అతను గాయపడ్డాడు. దీనితో బుధవారం నెట్స్‌కు హాజరుకాలేదు. ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్న అతను నాలుగో వనే్డలో ఆడే అవకాశం లేదని కివీస్ కోచ్ మైక్ హెసన్ తెలిపాడు. గురువారం ఉదయం పరిస్థితిని గమనించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని అన్నాడు. ఇలావుంటే, మెక్‌కలమ్ ఒకవేళ మ్యాచ్ ఆడకపోతే, అతని స్థానంలో కేన్ విలియమ్‌సన్ జట్టుకు సారథ్యం వహిస్తాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మెక్‌కలమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న విషయం తెలిసిందే. అతను రిటైరైన తర్వాత జట్టు నాయకత్వ బాధ్యతలను విలియమ్‌సన్‌కు అప్పగించాలని న్యూజిలాండ్ సెలక్షన్ కమిటీ ఇప్పటికే నిర్ణయించింది.
పుణెలో రంజీ ఫైనల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కు పుణె ఆతిథ్యం ఇస్తుంది. ఫిబ్రవరి మూడు నుంచి క్వార్టర్ పైనల్స్ ఆరంభమవుతాయి. ఈ పోటీలకు విశాఖపట్నం, వల్సాద్, ముంబయి, బెంగళూరు నగరాలు ఆతిథ్యమిస్తాయని బిసిసిఐ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సెమీ ఫైనల్స్‌ను బరోడా, కటక్ నగరాల్లో నిర్వహిస్తామని పేర్కొంది. ఫైనల్ ఫిబ్రవరి 24న పుణెలో మొదలవుతుందని వివరించింది.