క్రీడాభూమి

పెరుగుతున్న దోషులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసనే్న, జూలై 27: రష్యా అథ్లెట్లు నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించడాన్ని మానుకోవడం లేదు. దీనితో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే బృందం నుంచి భారీ సంఖ్యలో అథ్లెట్లు నిషేధానికి గురవుతున్నారు. తాజాగా 19 మంది రోయర్లు డోప్ పరీక్షలో విఫలమైనట్టు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ప్రకటించింది. డోప్ దోషుల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా, రియోకు వెళ్లే వారి సంఖ్య పలచబడుతున్నది. రష్యా రియో బృందాన్ని ప్రకటించిన తర్వాత, డోప్ దోషులుగా తేలడంతో వేటు పడిన వారి సంఖ్య 108కి చేరింది. రష్యాలో ప్రభుత్వమే క్రీడాకారులకు వ్యూహాత్మకంగా మాదక ద్రవ్యాలను అలవాటు చేస్తున్నదని వాడా ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ సమర్పించిన నివేదిక స్పష్టం చేసింది. క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ నివేదికను కొంత మంది తప్పుపట్టారు. రష్యా ఎదుగుదలను అణచివేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అయితే, వాడా నివేదిక బహిర్గతమై, దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని రష్యా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మళ్లీమళ్లీ డోపింగ్ కేసులు వెలుగులోకి రావడంతో, కుట్ర కోణం ఉత్తదేనని స్పష్టమైంది. ఒలింపిక్స్‌కు ఎంపికైన వారిలోనే వంద మందికిపైగా అథ్లెట్లు డోప్ దోషులుగా తేలడమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. మాదక ద్రవ్యాలు వినియోగించారని తేలిన వారిలో ప్రముఖ రోయర్ పావెల్ సోజికిన్ కూడా ఉన్నాడు. ప్రపంచ మేటి రోయర్లలో ఒకడైన సోజికిన్ కూడా మాదక ద్రవ్యాలను వాడినట్టు రుజువుకావడంతో రష్యా పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా, అడ్డదారిలో పతకాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్న రష్యాను ఒలింపిక్స్ నుంచి ఎందుకు నిషేధించ లేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధ్యక్షుడు థామస్ బాచ్‌ని పలువురు నిలదీస్తున్నారు. జర్మనీ ఒలింపిక్ డిస్కస్ త్రో చాంపియన్ రాబర్ట్ హార్టింగ్ ఈ విషయంలో ఒక అడుగు ముందుకేశాడు. ఐఒసి మద్దతు కూడా రష్యాకు ఉందా? అని అనుమానం వ్యక్తం చేశాడు. వందలాదిగా డోపింగ్ దోషులు బయటపడుతున్నప్పటికీ ఐఒసి ఎందుకు చేతులుకట్టుకొని కూర్చుందని ప్రశ్నించాడు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రస్తుత, మాజీ క్రీడాకారులు, అధికారులు, ప్రముఖులు కూడా ఐఒసి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నారు. క్రీడాస్ఫూర్తికి పాతర వేసిన రష్యాను తక్షణమే ఒలింపిక్స్ నుంచి నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విమర్శలకు రష్యా అధి కారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

రంగంలోకి పుతిన్
మాస్కో, జూలై 27: డోపింగ్ కేసులు పెరిగిపోవడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. తాజాగా 19 మంది రోయర్లపై వేటు పడడంతో, సస్పెన్షన్‌కు గురైన వారి సంఖ్య 108కి పెరి గింది. దీనితో పుతిన్ స్వయంగా రంగంలోకి దిగాడు. రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన బృందంలోని సభ్యులతో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం అధికారులను కలిసి సమాచారం తెలుసుకున్నాడు. రష్యాను ఒలింపిక్స్ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పుతిన్ హడావుడిగా దిద్దుబాటు చర్యలను చేపట్టాడు. అందులో భాగంగానే అతను ఒలింపిక్స్ బృందంలోని అథ్లెట్లను కలిశాడు. ఇలావుంటే, రష్యా వ్యూహత్మకంగా డోపింగ్‌కు పాల్పడుతున్నదని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ తేల్చిచెప్పడం క్రీడా ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ పరిస్థితుల్లో ఒలింపిక్స్ డోపింగ్ రహితంగా జరుగుతాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయ. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) ఈ విషయంలో ఎంత వరకు జాగ్రత్తగా ఉంటుందో, డోపింగ్‌ను ఎలా నియంత్రిస్తుందో చూడాలి.