క్రీడాభూమి

వీడియో గేమ్స్‌లో టీమిండియా బిజీబిజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, జూలై 27: వెస్టిండీస్ టూర్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు బుధవారం వీడియో గేమ్స్‌లో బిజీబిజీగా గడిపింది. కింగ్‌స్టన్ చేరుకున్న భారత క్రికెటర్లు ఆటవిడుపుగా వీడియో గేమ్స్ ఆడుతూ టైమ్‌పాస్ చేశారు. విండీస్‌ను మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 92 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా అదే ఉత్సాహంతో రెండో టెస్టు కోసం ఎదురుచూస్తున్నది. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులు సాధించిన ఓపెనర్ శిఖర్ ధావన్, జట్టు కోచ్ అనీల్ కుంబ్లే తదితరులు ఫిఫా ఫుట్‌బాల్ గేమ్ ఆడారు. భువనేశ్వర్ కుమార్, వృద్ధిమాన్ సాహా తదితరులు కూడా వీరితో చేరారు. తామంతా వీడియో గేమ్స్ ఆడుతున్న ఫొటోను శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఉంచాడు. కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. కోహ్లీ కూడా కార్గిల్ దివస్ సందర్భంగా అమర జవాన్లను గుర్తుచేసుకున్నాడు. ఆ యుద్ధం జరిగినప్పుడు తాను స్కూల్‌లో చదువుతున్నానని, అప్పట్లో ప్రతి కుటుంబం కార్గిల్ యుద్ధంలో భారత సైన్యానికి మద్దతుగా నిలవడం తనకు గుర్తుందని కోహ్లీ ట్వీట్ చేశాడు.