క్రీడాభూమి

‘లోధా’ సిఫార్సుల ప్రస్తావనే లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయ. ఆగ స్టు ఐదో తేదీన ముంబయలో వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) జరుగుతుందని తొలుత ప్రకటించారు. అయతే, సమావే శానికి నిర్దేశించిన అంశాల్లో ఎక్కడా లోధా కమిటీ సిఫార్సులు, వాటి అమలుకు సంబంధించిన ప్రస్తావనే లేదు. కాగా, సమావేశాన్ని ముంబయ నుంచి న్యూఢిల్లీకి మారుస్తున్నట్టు బిసిసిఐ ప్రకటించింది. ఇంత హడావుడిగా సమావేశ వేది కను ఎందుకు మార్చిందనే ప్రశ్నకు సమాధానం లేదు. అదే విధంగా ఎజెండాలో లోధా కమిటీ సిఫార్సుల అమలును ప్రస్తావించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. బోర్డు ఎంజిఎం జరుగుతున్న దన్న వార్త వెలువడిన వెంటనే, లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశంపై చర్చించడానికే అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయతే, ఎజెండాలో ఎక్కడా దీని గురించిన సమాచారం లేకపోవడంతో, ఎంజిఎంలో ఏఏ అంశాలను చర్చిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.
లంకను ఆదుకున్న వర్షం
పల్లేకల్, జూలై 27: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు శ్రీలంకను వర్షం ఆదుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు వెనుకంజలో ఉన్న లంక రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి ఆరు పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను కుశాల్ పెరెరా (4) రూపంలో చేజార్చుకుంది. ఆ వెంటనే భారీ వర్షం కురవడంతో రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించగా లంక ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో లంక కేవలం 117 పరుగులకే కుప్పకూలగా, ఆస్ట్రేలియా 203 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.