క్రీడాభూమి

ప్రవీణ్‌కు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: డోపింగ్ పరీక్షలో విఫలమైన నర్సింగ్ పంచయ్ యాదవ్ స్థానంలో ప్రవీణ్ రాణాను ఎంపిక చేస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) తీసుకున్న నిర్ణయానికి అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (యుడబ్ల్యుడబ్ల్యు) సానుకూలంగా స్పందించింది. అతని ఎంపిక పట్ల ఎలాంటి అభ్యంతరం లేదంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యుడబ్ల్యుడబ్ల్యు ఆమోద ముద్ర పడడంతో రియో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ పాల్గొనడం దాదాపుగా ఖాయమైంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధికారికంగా అతని అభ్యర్థిత్వాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. ఇలావుంటే, డోప్ పరీక్షలో నర్సింగ్ పట్టుబడడంతో మొదలైన ప్రకంపనలు కొనసాగుతునే ఉన్నాయి. సోనేపట్‌లోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)లో శిక్షణ పొందుతున్న సమయంలో నర్సింగ్ రూమ్‌మేట్‌గా ఉన్న సందీప్ తుల్సీ యాదవ్ కూడా డోప్ పరీక్షలో విఫలమయ్యాడు.