క్రీడాభూమి

మెండిస్ అజేయ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, జూలై 28: కుశాల్ మెండిస్ అజేయ శతకంతో రాణించడంతో, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక కోలుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు వెనుకంజలో ఉన్న లంక బుధవారం ఆటను వర్షం కారణంగా నిలిపివేసే సమయానికి తన రెండో ఇన్నింగ్స్‌లో కుశాల్ పెరెరా (4)ను కోల్పోయి ఆరు పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు, గురువారం ఆటను కొనసాగించిన లంక ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 282 పరుగులు చేసి, 196 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంకా నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి. కుశాల్ సిల్వ (7), దిముత్ కరుణరత్నే (0), కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (9) సింగిల్ డిజిట్స్‌కే పరిమితంకాగా, లంక ఒక దశలో 86 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇది సరిగ్గా మొదటి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు వెనుకబడిన స్కోరుకు సమానం. అప్పటికి చేతిలో ఆరు వికెట్లు మిగిలి ఉండగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరును లంక అతి కష్టం మీద చేరుకొని, ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడింది. అయితే, వరుస వికెట్ల పతనంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన లంకను కుశాల్ మెండిస్, దినేష్ చండీమల్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో లంక కోలుకుంది. 42 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద చండీమల్ అవుట్‌కాగా, కుశాల్ మేండిస్‌తో ధనంజయ డి సిల్వ కలిసి, ఆరో వికెట్‌కు 71 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. రెండు అత్యంత ప్రధానమైన పార్ట్‌నర్‌షిప్స్‌ను అందించే క్రమంలో కుశాల్ మేండిస్ కెరీర్‌లో మొదటి టెస్టు శతకాన్ని పూర్తి చేశాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి అతను 243 బంతుల్లో 169 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అతనికి తోడుగా దిల్‌రువాన్ పెరెరా (5) క్రీజ్‌లో కొనసాగుతున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 34.2 ఓవర్లలో 117 ఆలౌట్ (్ధనంజయ డి సిల్వ 24, కుశాల్ పెరెరా 20, లక్షన్ సండాకన్ 19, నాథన్ లియాన్ 3/12, జొస్ హజెల్‌వుడ్ 3/21, మిచెల్ స్టార్క్ 2/51, స్టీవ్ ఒకీఫ్ 2/32).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 79.2 ఓవర్లలో 203 ఆలౌట్ (ఆడం వోగ్స్ 47, మిచెల్ మార్ష్ 31, స్టీవెన్ స్మిత్ 30, రంగన హెరాత్ 4/49, లక్షన్ సండాకన్ 4/58, నువాన్ ప్రదీప్ 2/36).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టానికి 6 పరుగులు): 80 ఓవర్లలో ఆరు వికెట్లకు 282 (కుశాల్ మెండిస్ 169 నాటౌట్, దినేష్ చండీమల్ 42, ధనంజయ డి సిల్వ 36, మిచెల్ స్టార్క్ 2/44, నాథన్ లియాన్ 2/98).