క్రీడాభూమి

కుప్పకూలిన జింబాబ్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బులవాయో, జూలై 28: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నిం గ్స్‌లో జింబాబ్వే కేవలం 164 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 32 పరుగులు చేసింది. మార్టిన్ గుప్టిల్ (10), టామ్ లాథమ్ (16) నాటౌట్‌గా ఉన్నారు. అంతకు ముందు టాస్ గెలిచిన జిం బాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది. అయతే, టెయలెండర్ డొనాల్డ్ తిరిపానో (49 నాటౌట్), ప్రిన్స్ మస్వారా (42) తప్ప మిగతా వారంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో జింబాబ్వే కనీ సం రెండు వందల పరుగుల మైలురాయని కూడా చేరలేకపోయంది. న్యూజిలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్ 41 పరుగులకే ఆరు వికెట్లు కూల్చడం విశేషం. కాగా, కివీస్ ఓపెనర్లపై జింబాబ్వే బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.