క్రీడాభూమి

నర్సింగ్ డోప్ కేసులో నాడా తీర్పు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: డోపింగ్ పరీక్షలో విఫలమైన రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) క్రమశిక్షణ కమిటీ తన తీర్పును వాయిదా వేసింది. శనివారం లేదా సోమవారం తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 74 కిలోల విభాగంలో భారత్ నుంచి ఒకరికి రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. రెండు సార్లు ఒలింపిక్ పతకాలను సాధించిన సుశీల్ కుమార్‌ను కాదని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) నర్సింగ్‌కు మద్దతు పలికింది. అయితే, అతను డోపింగ్ పరీక్షలో పట్టుబడడంతో తాత్కాలికంగా వేటు వేసింది. ‘బి’ శాంపిల్స్‌లోనూ నర్సింగ్ దోషిగా తేలగా, అతని స్థానంలో ప్రవీణ్ రాణాను ఎంపిక చేసింది. ఒకవేళ నాడా తీర్పు నర్సింగ్‌కు అనుకూలంగా ఉంటే, అతనినే ఒలింపిక్స్‌కు పంపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించింది. ఇలావుంటే, తనపై కుట్ర జరిగిందని, ఇద్దరు రెజ్లర్లు ఉద్దేశపూర్వకంగా తనను డోపింగ్ దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించారని నర్సింగ్ ఆరోపించాడు. అంతేగాక, సోనేపట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. ‘ఎ’, ‘బి’ శాంపిల్స్‌లో నర్సింగ్ మాదక ద్రవ్యాలను వాడినట్టు రుజువైందని నాడా అధికారులు క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) శిక్షణా కేంద్రంలో అతనికి సరఫరా చేసిన ఆహారంలోగానీ, పానీయాల్లోగానీ ఎలాంటి కల్తీ చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. జూన్ 25న జరిపిన మొదటి డోప్ టెస్టు, ఈనెల ఐదో తేదీన నిర్వహించిన రెండో డోప్ టెస్టులో 26 ఏళ్ల నర్సింగ్ దోషిగానే తేలిందని పేర్కొన్నారు. కాగా, కమిటీకి విదుష్పత్ సింఘానియా నేతృత్వంలోని నర్సింగ్ తరఫు లాయర్ల బృందం 600 పేజీలతో కూడిన కౌంటర్ అఫిడవిట్‌ను సమర్పించింది. డోపింగ్ పరీక్షా ఫలితాలను ఈ బృందం తప్పుపట్టక పోవడం గమనార్హం. నర్సింగ్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడన్నది వాస్తవమని, అయితే, అది అతనికి తెలియకుండా జరిగిన తప్పిదమని పేర్కొంది. ప్రాక్టీస్ చేసే సమయంలో నర్సింగ్ తన వాటర్ బాటిల్‌ను ఒక దగ్గర ఉంచి కాలకృత్యాలకు వెళతాడని లాయర్ల బృందం వివరించింది. అతను వెళ్లడాన్ని గమనించిన ఎవరో ఉద్దేశపూర్వరకంగా అతని వాటర్ బాటిల్‌లో మాదక ద్రవ్యాన్ని కలిపి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. 17 ఏళ్ల యువ రెజ్లర్‌పై అనుమానం వ్యక్తం చేసింది. కాగా, ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత నాడా క్రమశిక్షణ కమిటీ తీర్పును వాయిదా వేసింది.
వివరాలు అందించాం: సింఘానియా
నాడా క్రమశిక్షణ కమిటీకి నర్సింగ్ వాదనను వినిపిస్తూ పూర్తి వివరాలను అందించామని అతని తరఫు లాయర్ సింఘానియా తెలిపాడు. గురువారం అతను విలేఖరులతో మాట్లాడుతూ కమిటీ తమ అభిప్రాయాలను, వాదనను ఎంతో ఒపిగ్గా విన్నదని చెప్పాడు. నర్సింగ్‌కు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని అన్నాడు. అతను రియో ఒలింపిక్స్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఎవరో కుట్ర పన్నారన్న అనుమానం ఉందన్నాడు. లోతైన విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయన్నాడు. నర్సింగ్ ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌కు పాల్పడలేదన్నది నిజమని, ఇదే విషయాన్ని కమిటీకి వివరించామని తెలిపాడు.

చిత్రం.. నర్సింగ్ పంచమ్ యాదవ్