క్రీడాభూమి

విండీస్‌తో రెండో టెస్టుకు టీమిండియా ముమ్మర ప్రాక్టీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమైకా, జూలై 28: వెస్టిండీస్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం భారత క్రికెటర్లు నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఇక్కడి సబీనా పార్క్‌లో గురువారం ఉదయం నెట్స్‌కు హాజరైన టీమిండియా సభ్యులు అవిశ్రాంతంగా శ్రమించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో స్టార్ అట్రాక్షన్‌గా నిలిచాడు. మొదటి టెస్టును భారత్ ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో గెల్చుకుంటే, కోహ్లీ కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లోనే అపూర్వ విజయాన్ని నమోదు చేసింది. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి అభిమానులను అలరించాడు. రెండో టెస్టులోనూ అతని నుంచి వారు అదే స్థాయి ప్రదర్శనను ఆశిస్తున్నారు. పెరుగుతున్న అంచనాలకు తగినట్టు ఆడేందుకు ప్రయత్నించాల్సిన అవసరాన్ని గుర్తించిన కోహ్లీ నెట్స్‌లో శ్రమించాడు. వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా కొంత సేపు బ్యాటింగ్ చేశాడు. అయితే, ఎక్కువ సమయం అతను కీపింగ్ నైపుణ్యాన్ని పెంచుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించాడు. మొదటి టెస్టు ఆడుతున్నప్పుడు చేతి బొటనవేలికి తగిలిన గాయం నుంచి ఓపెనర్ మురళీ విజయ్ పూర్తిగా కోలుకున్నాడు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా అతను కొద్దిసేపు మాత్రమే నెట్స్‌లో బ్యాటింగ్ చేశాడు. ఎడమచేతి వాటం ఓపెనర్ శిఖర్ ధావన్ పూర్తిస్థాయిలో పలువురి బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. బలమైన షాట్లు కొడుతూ తాను ఫామ్‌లో ఉన్నానని నిరూపించుకున్నాడు. చాలాసేపు బ్యాటింగ్ చేసిన అతను ఆతర్వాత మైదానంలో ఫిట్నెస్ ఎక్సర్‌సైజ్‌లో నిమగ్నమయ్యాడు.
మొదటి టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ, అశ్విన్ సెంచరీ సాధించగా, శిఖర్ ధావన్ 84 పరుగులతో రాణించాడు. అశ్విన్ మొదటి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ సాధించలేకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో 83 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టి వెస్టిండీస్‌ను దారుణంగా దెబ్బతీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెల్చుకున్నాడు. అతను కూడా గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో తీరికలేకుండా గడిపాడు. బౌలింగ్‌పై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు కూడా కొంత సమయాన్ని కేటాయించాడు.

చిత్రాలు.. నెట్స్‌కు హాజరైన యువ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్‌కు సూచనలిస్తున్న భారత క్రికెట్ జట్టు కోచ్, మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే

ఫిజికల్ ఫిట్నెస్ కోసం సబీనా పార్క్ మైదానంలో కసరత్తు చేస్తున్న భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. విండీస్‌తో రెండో టెస్టు శుక్రవారం మొదలవుతుంది