క్రీడాభూమి

శాలీ పియర్స్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూలై 29: ప్రపంచ మహిళల అథ్లెటిక్స్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన ఆస్ట్రేలియా మేటి హర్డిల్స్ రన్నర్ శాలీ పియర్స్ రియో ఒలింపిక్స్‌కు దూరమైంది. చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న ఆమె పూర్తిగా కోలుకోక ముందే కండరాలు చిట్లడంతో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదని ప్రకటించింది. 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆమె రియో ఒలింపిక్స్‌కు గోల్డ్ కోస్ట్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కాలి కండరాలు చిట్లినట్టు తెలుస్తోంది. తాను రియోకు వెళ్లడం అనుమానమేనని ఇంతకు ముందే ప్రకటించిన శాలీ ఇప్పుడు ఆదే విషయాన్ని ధ్రువీకరించింది. కనీసం రెండుమూడు వారాల విశ్రాంతి అవసరమైన నేపథ్యంలో, పూర్తిగా కోలుకోకుండా ఒలింపిక్స్‌కు హాజరుకావడంలో అర్థం కాలేదని శాలీ ట్వీట్ చేసింది. లండన్ ఒలింపిక్స్‌కు ముందు, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్న ఆమె వరుసగా మూడోసారి కూడా ఒలింపిక్ పతకంపై కనే్నసింది. కానీ, ఆ ప్రయత్నాలకు తాజా గాయం గండికొట్టింది.

ఉత్కంఠగా ఆసీస్, లంక టెస్టు
పల్లేకర్, జూలై 29: శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ ఆసక్తిని రేపుతున్నది. 268 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఈ జట్టు ఇంకా 185 పరుగులు చేయాల్సి ఉంది. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. అంతకు ముందు, ఆరు వికెట్ల నష్టానికి 282 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఉదయం ఆటను కొనసాగించిన లంక 353 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ 176 పరుగులు చేసి అవుట్‌కాగా, చివరిలో రంగన హెరాత్ 35 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 84 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. జొస్ హాజెల్‌వుడ్, నాథన్ లియాన్ చెరి రెండు వికెట్లు కూల్చారు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా కేవలం రెండు పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1)ను కోల్పోయింది. ఉస్మాన్ ఖాజా 18 పరుగులు చేసి వెనుదిరగ్గా, బర్న్స్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుటయ్యాడు. 63 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను ఆదుకునే బాధ్యతను కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (26 నాటౌట్), ఆడం వోగ్స్ (9) స్వీకరించారు. వీరిద్దరూ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ మూడోరోజు ఆటను ముగించారు.