క్రీడాభూమి

వ్యూహాత్మక డోపింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యాలో ప్రభుత్వమే జోక్యం చేసుకొని, అథ్లెట్లతో వ్యూహాత్మకంగా డోపింగ్ చేయంచిందన్న వార్త క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఎంతో మంది మేటి అథ్లెట్లు డోపింగ్ దోషులేనని వాడా ఆధ్వర్యంలోని కమిటీ తేల్చి చెప్పడంతో నిషిద్ధ మాదక ద్రవ్యాల వినియోగంలో కొత్త కోణం ఆవిష్కృతమైంది. మరియా సవినొవా, లుడ్మిలా బియాన్‌స్కా, బిర్యుకోవా వంటి స్టార్లు డోపింగ్‌కు పాల్పడిన వారేనని వాడా కమిటీ తేల్చి చెప్పింది. కాగా, తాను మాదక ద్రవ్యాలను వినియోగించానని, ఆ విషయం బయటకు రాకుండా అధికారులకు భారీ మొత్తాలను లంచంగా ఇచ్చానని లిలియా షొబుకొవా చేసిన ప్రకటన రష్యా క్రీడా రంగంలో నెలకొన్న అవినీతిని, అక్రమ విధానాలను తేటతెల్లం చేస్తున్నది.
ఎడిఎపై వేటు: వ్యూహాత్మక డోపింగ్ వ్యవహారంపై ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) కఠిన చర్యలకు ఉపక్రమించింది. రష్యా డోపింగ్ నిరోధిక ఏజెన్సీ (రష్యాఎడిఎ)పై సస్పెన్షన్ వేటు వేసింది. పతకాలు సాధించేందుకు వీలుగా అథ్లెట్లకు ఉత్ప్రేరకాల వాడకాన్ని రష్యా ప్రభుత్వం స్వయంగా ప్రోత్సహిస్తున్నదని, ఈ తతంగం కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నదని ఇటీవల జరిగిన విచారణలో స్పష్టం కావడంతో, దోషులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రష్యా ఎడిఎను నిషేధించింది. అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడడం కొత్తకాదు. అయితే, ప్రభుత్వాలే నేరుగా కల్పించుకొని, వ్యూహాత్మకంగా అమలు చేసిందన్న వార్తలు బయటకు రావడం మాత్రం ఇదే మొదటిసారి. అందుకే, ఒలింపిక్స్ నుంచి రష్యాను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) ప్రకటించింది. అక్కడి ఎడిఎ స్వతంత్ర సంస్థగా కాకుండా ప్రభుత్వ ఏజెంటుగా మారిపోయి, డోపింగ్‌కు పాల్పడినట్టు తెలిసినప్పటికీ అథ్లెట్లకు క్లీన్ చిట్ ఇస్తూ మోసగించిందని ధ్వజమెత్తింది. వాడాతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అధికారిక డోపింగ్ నిరోధక విభాగం ఉన్న దేశాలు మాత్రమే మేజర్ ఈవెంట్స్‌లో పాల్గొనవచ్చు. రష్యా ఎడిఎను వాడా నిషేధించిన నేపథ్యంలో, ఆ దేశ అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది.

లలిత్ మోదీకే పగ్గాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌కు కమిషనర్‌గా వ్యవహరించి, ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఈవెంట్‌గా తీర్చిదిద్దిన లలిత్ మోదీని ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో తన పదవిని కోల్పోయాడు. దీనితో ఒక రకంగా అతనికి భారత క్రికెట్‌తో సంబంధాలు తెగిపోయాయ. అయతే, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సిఎ) ఎన్నికల్లో నిలబడాలని అతను నిర్ణయంచుకున్నప్పుడు బిసిసిఐ అప్పటి అధ్యక్షుడు శ్రీనివాసన్ అడ్డం పడ్డాడు. లలిత్ మోదీకి సహకరించవద్దని అందరికీ సూచించాడు. ఒకానొక దశలో కోర్టును ఆశ్రయంచాడు. లలిత్ మోదీకి అనుకూలంగా తీర్పు వెలువడడంతో అతను అధ్యక్ష పదవికి పోటీచేసి ఎన్నికయ్యాడు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయన శ్రీని ఏకంగా ఆర్‌సిఎనే రద్దుచేసి, కొత్త వివాదానికి తెరతీశాడు. ఆ ఎత్తు కూడా బెడిసికొట్టడంతో ఆర్‌సిఎలోని ఒక వర్గాన్ని ప్రోత్సహించి, లలిత్ మోదీపై అవిశ్వాస తీర్మానానికి ప్రేరేపించాడు. అనంతరం చోటు అత్యంత వేగంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బిసిసిఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఎన్నికయ్యాడు. సహజంగానే మిగతా అన్ని క్రికెట్ సంఘాలపై ఈ మార్పు ప్రభావాన్ని చూపింది. లలిత్ మోదీపై అవిశ్వాస తీర్మాన నిర్ణయాన్ని అతని వ్యతిరేక వర్గం రద్దు చేసుకుంది. దీనితో లలిత్ మోదీకే మళ్లీ ఆర్‌సిఎ పగ్గాలు లభించడం ఖాయమైంది.