క్రీడాభూమి

జూనియర్ హాకీ జట్టుకు ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్లో (ఇంగ్లాండ్), ఆగస్టు 1: ఇంగ్లాండ్ చేతిలో భారత జూనియర్ హాకీ జట్టుకు పరాజయం ఎదురైంది. మార్లోలోని బిషామ్ అబే స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 2-1 గోల్స్ తేడాతో భారత జూనియర్ జట్టుపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో భారత జట్టు బాగానే ఆడినప్పటికీ పలు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయింది. అయితే 24వ నిమిషంలో అజయ్ యాదవ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి భారత జట్టుకు శుభారంభాన్ని అందించాడు. కానీ ఈ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. 26వ నిమిషంలో విల్ కాల్నన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి ఇంగ్లాండ్ జట్టుకు ఈక్విలైజర్‌ను అందించగా, 30వ నిమిషంలో ఎడ్ హోర్లర్ ఆతిథ్య జట్టుకు మరో గోల్ సాధించిపెట్టాడు. దీంతో ప్రథమార్థ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 2-1 ఆధిక్యతలో నిలిచింది. ద్వితీయార్థంలో గట్టిగా పోరాడిన భారత జట్టు అనేక అవకాశాలను సృష్టించుకున్నప్పటికీ ఈక్విలైజర్ సాధించకుండా సమర్ధవంతంగా ప్రతిఘటించిన ఇంగ్లాండ్ జట్టు 2-1 గోల్స్ తేడాతో భారత జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు అనేక అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవడమే ఇంగ్లాండ్ జట్టు విజయానికి ప్రధాన కారణం. ఈ విషయాన్ని భారత జట్టు కోచ్ హరేందర్ సింగ్ కూడా అంగీకరించాడు. తదుపరి మ్యాచ్‌లో ఈ లోపాన్ని సరిదిద్దుకోగలమని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.