క్రీడాభూమి

నేడు బిసిసిఐ అత్యవసర భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 1: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలని స్పష్టం చేస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించేందుకు బిసిసిఐ పెద్దలు మంగళవారం ముంబయిలో సమావేశం కానున్నారు. జస్టిస్ లోధా కమిటీతో బిసిసిఐ పెద్దలు జరపాల్సిన కీలక సమావేశానికి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో బిసిసిఐ వర్కింగ్ కమిటీ ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత క్రికెట్ బోర్డు స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా సుప్రీ కోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ నెలాఖరున వెస్టిండీస్ జట్టుతో రెండు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్ నిర్వహించాలన్న ప్రతిపాదనపై కూడా బిసిసిఐ పెద్దలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. బిసిసిఐని ప్రక్షాళన చేసేందుకు లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏళ్ల తరబడి బోర్డులో తిష్ట వేసిన పలువురు ప్రముఖులతో పాటు ‘సీనియర్ సిటిజన్ల’ పదవులకు పెనుముప్పు ఏర్పడిన విషయం తెలిసిందే. బిసిసిఐ వర్కింగ్ కమిటీ భేటీ ముగిసిన తర్వాత సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించేందుకు బోర్డు ఈ నెల 5వ తేదీన న్యూఢిల్లీలో ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఎస్‌జిఎం) నిర్వహించనుంది. ఆ తర్వాత బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే ఈ నెల 9వ తేదీన ఢిల్లీలో జస్టిస్ లోధా కమిటీతో చర్చించనున్నారు. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా బిసిసిఐని ప్రక్షాళన చేసేందుకు అనుసరించే మార్గాలపై తమతో చర్చించేందుకు రావాలని జస్టిస్ లోధా కమిటీ వీరిని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో మంగళవారం అత్యవసరంగా సమావేశమవుతున్న బిసిసిఐ పెద్దలు సుప్రీం కోర్టు తీర్పుపై కూలంకషంగా చర్చ జరపడం ఖాయమని స్పష్టమవుతోంది. అలాగే అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ నెలాఖరున వెస్టిండీస్‌తో నిర్వహించ తలపెట్టిన రెండు మ్యాచ్‌ల టి-20 క్రికెట్ సిరీస్ గురించి కూడా వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించడం జరుగుతుందని బిసిసిఐ అధికారి ఒకరు వెల్లడించారు.