క్రీడాభూమి

రాహుల్ అత్యుత్తమ స్కోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్ (జమైకా), ఆగస్టు 1: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో విజృంభించిన టీమిండియా ఓపెనర్ లోకేష్ రాహుల్ కెరీర్‌లోనే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుతో సత్తా చాటుకున్నాడు. రెండో వికెట్‌కు చటేశ్వర్ పుజారా (46)తో కలసి 121 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన అతను 303 బంతుల్లో 158 పరుగులు సాధించి గాబ్రియెల్ బౌలింగ్‌లో డౌరిచ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాచాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ (44), రవిచంద్రన్ అశ్విన్ (3) నిష్క్రమించడంతో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం మూడో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నైట్‌వాచ్‌మన్లు అజింక్యా రహానే, వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా క్రీజ్‌లో నిలదొక్కుకుని విండీస్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. చక్కటి సమన్వయంతో స్థిమితంగా ఆడిన వీరు చూడముచ్చటైన షాట్లతో అలరించి ఆరో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం సాహా (47) జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా నిష్క్రమించడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. అయితే 93 బంతుల్లో అర్ధ శతకాన్ని నమోదు చేసుకున్న రహానే అప్పటికి 74 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో మధ్యాహ్న భోజన విరామ సమయానికి 6 వికెట్లు నష్టపోయి 425 పరుగులు సాధించిన భారత జట్టు కరీబియన్ల కంటే 229 పరుగుల ఆధిక్యత సాధించింది.

చిత్రం.. అజింక్యా రహానే అప్పటికి (74 నాటౌట్)