క్రీడాభూమి

‘రియో’కి లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: డోపింగ్ కుంభకోణంలో రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు ఊరట లభించింది. గత కొద్ది రోజుల నుంచి కొనసాగుతున్న ఈ వివాదానికి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సోమవారం ఎట్టకేలకు తెరదించి నర్సింగ్ యాదవ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో అతను ఈ నెల 5వ తేదీ నుంచి బ్రెజిల్‌లో ప్రారంభమయ్యే రియో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. నర్సింగ్ యాదవ్ మెథాన్‌డియెనోన్ అనే నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని వాడినట్లు గత నెల 25వ తేదీన పరీక్షల్లో వెల్లడవడంతో అప్పటి నుంచి అతని చుట్టూ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం నుంచి నర్సింగ్ యాదవ్‌కు విముక్తి కల్పించడం ద్వారా గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న హైడ్రామాకు తెర దించుతున్నట్లు నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ సోమవారం ప్రకటించాడు. ‘నర్సింగ్ యాదవ్ గతాన్ని మేము గమనంలోకి తీసుకున్నాం. జూన్ 2వ తేదీ వరకు ఎన్నడూ డోపింగ్‌కు పాల్పడని అతను ఆ తర్వాత అనూహ్యంగా డోపింగ్ పరీక్షలో విఫలమవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నప్పటికీ అతను ఉద్దేశ్యపూర్వకంగా ఈ తప్పిదానికి పాల్పడినట్లు కనిపించడం లేదు. అందుకే డోపింగ్ ఆరోపణల నుంచి అతనికి విముక్తి కల్పిస్తున్నాం’ అని నాడా తీర్పును చదివి వినిపిస్తూ నవీన్ అగర్వాల్ వెల్లడించాడు. ఎవరో పన్నిన కుట్రకు నర్సింగ్ యావద్ వివాదంలో చిక్కుకున్నట్లు భావిస్తున్నామని, దీనిని దృష్టిలో ఉంచుకుని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిబంధనావళిలోని ఆర్టికల్ 10.4 కింద అతనికి డోపింగ్ ఆరోపణల నుంచి విముక్తి కల్పిస్తున్నామని నాడా విచారణ కమిటీ తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పుతో నర్సింగ్ యాదవ్ మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు.
***
నేను ఎటువంటి తప్పు చేయలేదని తెలుసు. అందుకే న్యాయం జరుగుతుందని గట్టిగా విశ్వసించా. చివరికి నా నమ్మకమే నిజమైంది. నిజం గెలిచింది. ఇప్పుడు నాడా విచారణ కమిటీ ఇచ్చిన తీర్పుతో నాకు న్యాయం జరిగింది. ఇది చాలా పెద్ద విజయం. ఇది ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ తీర్పుతో ఇక ముందు ఏ క్రీడాకారుడికీ నా లాంటి పరిస్థితి ఎదురుకాబోదని భావిస్తున్నా. ఇక రియో ఒలింపిక్స్‌కు వెళ్లి దేశానికి పతకాన్ని అందించాలని ఎదురు చూస్తున్నా’
- నర్సింగ్ యాదవ్