క్రీడాభూమి

ఆశలు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఒలింపిక్ క్రీడల్లో మన దేశానికి పతకాన్ని అందిస్తాడని ఆశించిన షాట్‌పుటర్ ఇందర్‌జీత్ సింగ్ వరుసగా రెండోసారి కూడా డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో అతను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ద్వారాలు మూసుకుపోయాయి. ఇందర్‌జీత్ నుంచి సేకరించిన ఏ శాంపిల్‌కు కొద్ది రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా, అతను ఆండ్రోస్టెరోన్, ఎటియోకొలనోలోన్ అనే స్టెరాయిడ్లను ఉపయోగించినట్లు తేలిన విషయం విదితమే. ప్రస్తుతం అతని బి శాంపిల్‌కు నిర్వహించిన పరీక్షలోనూ ఇదే విషయం వెల్లడైందని అధికార వర్గాలు మంగళవారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపాయి. దీంతో అతను రియో ఒలింపిక్స్‌కు దూరమవడంతో పాటు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) కొత్త నిబంధనల ప్రకారం నాలుగేళ్ల పాటు నిషేధానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తాత్కాలిక సస్పెన్షన్‌కు గురైన ఇందర్‌జీత్ ఇప్పుడు బి శాంపిల్ పరీక్షలోనూ విఫలమవడంతో అతనికి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) రెండో నోటీసు జారీ చేసింది. దీంతో అతను విచారణ నిమిత్తం నాడా క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరై తన వాదన వినిపించాల్సి ఉంటుంది.
2014లో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించిన ఇందర్‌జీత్ గత నెల 25వ తేదీన ఏ శాంపిల్ పరీక్షలో విఫలమవడంతో ఏడు రోజుల్లోగా బి శాంపిల్‌ను పరీక్షించుకోవాలని నాడా అతనికి స్పష్టం చేసిన విషయం విదితమే. దీంతో అతను గురువారం బి శాంపిల్‌ను పరీక్షించుకోగా దాని ఫలితం మంగళవారం వెలువడింది. దీంతో అతను ఈ నెల 5వ తేదీ నుంచి బ్రెజిల్‌లో ప్రారంభమయ్యే రియో ఒలింపిక్స్‌కు దూరమవడంతో పాటు వాడా నిబంధనల ప్రకారం నాలుగేళ్ల పాటు నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది.
కచ్చితంగా కుట్రే : ఇందర్‌జీత్
అయితే డోపింగ్ పరీక్షలో తాను విఫలమవడం వెనుక ఏదో కుట్ర జరిగిందని, పరీక్ష కోసం తన నుంచి సేకరించిన శాంపిల్‌ను ట్యాంపర్ (కల్తీ) చేశారని ఇందర్‌జీత్ సింగ్ ఆరోపించాడు. ‘కచ్చితంగా ఇది కుట్రే. ఈ వ్యవహారంలో ఏదో మోసం జరిగింది. ఇటువంటి మోసాలకు వైద్యులు అడ్డుకట్ట వేయాలి. ఈ దేశంలో ఎవరైనా గొంతెత్తి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే బలవంతంగా వారి గొంతు నొక్కేస్తున్నారు. నా నుంచి సేకరించిన శాంపిల్‌ను ట్యాంపర్ చేశారు. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్ధాన్ని ఎవరైనా ఎందుకు ఉపయోగిస్తారు?’ అని ఇందర్‌జీత్ వాపోయాడు.
జాతీయ శిక్షణా శిబిరానికి అంతగా హాజరుకాకుండా వ్యక్తిగతంగా కోచ్‌ను నియమించుకుని సొంతగా శిక్షణ పొందుతున్న ఇందర్‌జీత్, తన నోరు నొక్కేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పాడు. ‘ప్రస్తుతానికి నేనేమీ మాట్లాడే స్థితిలో లేను. కానీ మన దేశంలో ఒక క్రీడాకారుడిని నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వాదనను నేను గట్టిగా సమర్ధించుకుంటా. గత ఏడాది దాదాపు 50 సార్లు డోపింగ్ పరీక్షలు చేయించుకున్న నేను ఈ ఏడాది కూడా ప్రతిసారీ పరీక్షలు చేయించుకున్నా. నా నోరు నొక్కేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ దేశంలోని క్రీడాకారుల తరఫున ధైర్యంగా మాట్లాడుతా. గత ఏడాది కాలం నుంచి ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి ఆటగాళ్లను కలవరపెడుతున్నాయి’ అని ఇందర్‌జీత్ స్పష్టం చేశాడు.
రియో ఒలింపిక్స్‌కు తొలుత అర్హత సాధించిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లలో ఇందర్‌జీత్ ఒకడు. గత ఏడాదే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఇందర్‌జీత్ సింగ్ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన టిఓపి (టార్గెట్ పోడియం ఫినిష్) పథకం కింద నిధులు పొంది ఈ ఏడాది ఆరంభంలో అమెరికాలో శిక్షణ పొందాడు.
chitram...
నాలుగేళ్ల నిషేధం అంచున ఇందర్‌జీత్ సింగ్