క్రీడాభూమి

తెరపైకి సెమెన్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 4: దక్షిణాఫ్రికా అథ్లెట్ కాస్టర్ సెమెన్యా మళ్లీ తెరపైకి వచ్చింది. పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్న కారణంగా మహిళల విభాగంలో పోటీ చేయడానికి వీల్లేదని అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య స్పష్టం చేయడంతో సెమెన్యా క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ సంపాదించింది. సెమెన్యాలో జన్యుపరమైన అసమానతలు ఉన్నప్పటికీ, పురుషుడిగా పేర్కోవడానికి వీల్లేదని కోర్టు తేల్చిచెప్పింది. పురుష లక్షణాలు కలిగివుండి, మహిళల విభాగంలో పోటీపడుతున్న చాలా మంది అథ్లెట్లకు సెమెన్యా కేసు మార్గదర్శకమైంది. చాలాకాలంగా దాదాపు అజ్ఞాతవాసం గడుపుతున్న సెమెన్యా రియో ఒలింపిక్స్‌లో ప్రత్యక్షమైంది. మహిళల 400 మీటర్లు, 800 మీటర్ల పరుగులో ఆమె పోటీపడుతుంది.

చిత్రం.. కాస్టర్ సెమెన్యా