క్రీడాభూమి

రష్యా అథ్లెట్లకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 4: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం చేజారిపోతుందేమోనని ఆందోళనకు గురైన రష్యా అథ్లెట్లకు ఊరట లభించింది. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్న వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నిర్ణయించింది. ఒలింపిక్స్‌కు ఎంపికైన రష్యా బృందంలో ఏకంగా 117 మంది డోప్ పరీక్షలో విఫలం కావడంతో క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే. వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిన రష్యాను ఒలింపిక్స్ నుంచి నిషేధించాలన్న డిమాండ్ తీవ్రతరం కావడంతో, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదికను అనుసరించి రష్యాను ఒలింపిక్స్‌కు అనుమతించాలా లేదా అన్న అంశాన్ని ఐఒసి పరిశీలిస్తుంది. అయితే, వ్యక్తిగతంగా క్లియరెన్స్‌కు దరఖాస్తు చేరుకున్న వారికి అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నుంచి సానుకూల స్పందన రావడంతో వారు రష్యా తరఫున పోటీకి దిగుతారు. ఒకవేళ రష్యాపై వేటు పడితే, వ్యక్తిగత హోదాలో ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. రియో ఒలింపిక్స్‌కు రష్యా 387 మందిని ఎంపిక చేసింది. వీరిలో ఇప్పటి వరకూ 117 మంది డోపింగ్ కేసులో విఫలమై, సస్పెన్షన్‌కు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే దేశానికి చెందిన వందలాది మంది డోప్ దోషులుగా తేలడం ఐఒసిని ఆందోళనకు గురి చేసింది. అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడడం, పతకాలు సాధించడానికి అడ్డదారులు తొక్కడం కొత్తకాకపోయినా, నేరుగా ప్రభుత్వమే కల్పించుకొని, ఒక వ్యూహం ప్రకారం వారికి ఉత్ప్రేరకాలను అలవాటు చేస్తున్నదన్న వాస్తవం ఐఒసిని భయపెడుతున్నది. ఈ పరిస్థితిని రష్యా స్వయంకృతమని కొందరు వాదిస్తున్నా, దశాబ్దాలకు దశాబ్దాలు ఐఒసి, వివిధ అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు, సంఘాలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్న ఎదురవుతున్నది. రష్యాలో సర్కారు, క్రీడా సమాఖ్యల అధికారులతోపాటు డోపింగ్ పరీక్షా కేంద్రం సిబ్బంది కూడా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడ్డారని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ సుమారు ఏడాది క్రితమే స్పష్టం చేసింది. కానీ, ఐఒసి పరిస్థితి విషమించే వరకూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. రష్యాలోని డోపింగ్ నిరోధక విభాగం (ఎడిఎ) స్వతంత్ర సంస్థగా కాకుండా ప్రభుత్వ ఏజెంటుగా మారిపోయిందని వాడా చేసిన హెచ్చరికలను ఎందుకు పట్టించుకోలేదని నిలదీస్తున్న వారికి ఐఒసి సమాధానం చెప్పుకోలేకపోతున్నది. అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడినట్టు తెలిసినప్పటికీ వారికి క్లీన్ చిట్ ఇస్తూ రష్యా ఎడిఎ క్రీడా ప్రపంచాన్ని మోసగిస్తుంటే ఐఒసి ఉదాసీనంగా వ్యవహరించిందన్న విమర్శల్లో నిజం లేకపోలేదు. వాడాతో ఐఒసి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎడిఎ కేంద్రాలు ఉన్న దేశాలకు మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత ఉంటుంది. రష్యా ఎడిఎను వాడా నిషేధించిన నేపథ్యంలో, ఆ దేశ బృందాన్ని ఒలింపిక్స్‌కు ఎలా అనుమతించారన్న ప్రశ్నకు కూడా ఐఒసి సమాధానం చెప్పాలి. డోపింగ్ సమస్య ఒలింపిక్స్‌ను కుదిపేసే ప్రమాదం కనిపిస్తున్నది. దీని నుంచి ఎలా బయటపడాలన్న విషయానికి ప్రాధాన్యతనిచ్చిన అధికారులు చివరికి త్రిసభ్య కమిటీ వల్ల సమస్య నుంచి తప్పించుకున్నారు.